సంక్రాంతి సంబరం దగ్గరకు వచ్చేసింది. ఇంకో రెండు రోజులలో మొదటి సంక్రాంతి సినిమా దర్బార్ విడుదల కానుంది. అయితే ప్రధానంగా పోటీ మాత్రం సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాల మధ్యనే ఉండబోతుంది. ప్రమోషన్స్ లో ఒకరి మీద ఒకరు కాళ్లు రువ్వుకున్నారు. రిలీజ్ డేట్ల గురించి కూడా చివరి నిముషం వరకూ సస్పెన్స్ కొనసాగింది.
అయితే ఇప్పుడు మరికొన్ని రోజులలో ప్రేక్షకులు ఏ సినిమా ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. ఇది ఇలా ఉండగా రెండు సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్స్ సంపాదించుకున్నాయి. అయితే రెండు సినిమాలు లెంగ్త్ విషయంలో కొద్ది పాటి సమస్యను ఎదురుకుంటున్నాయి.
సరిలేరు నీకెవ్వరూ 149 నిముషాలు, అల వైకుంఠపురంలో 145 నిముషాల నిడివి ఉన్నాయి. సహజంగా 140 నిముషాల కంటే ఎక్కువగా ఒక సినిమా నిడివి ఉంటే కొంచెం ఇబ్బందిగా భావిస్తారు. అయితే చిత్ర బృందాలు మాత్రం తమ కంటెంట్ మీద నమ్మకంతో తమకు అటువంటి అనుమానాలు ఏవీ లేవు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా అనిల్ గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.





