అనుకున్నట్లే అవుతోంది… విమర్శల్లో మహేష్ బాబు..!

Mahesh Babu Tweets RGV AP Special Statusఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు, ఇటీవల తమిళ సంప్రదాయం జల్లికట్టుకు అనుకూలంగా చేసిన ట్వీట్, తనకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతోంది. మరొకరు వేలెత్తి చూపించే విధంగా ప్రవర్తించని మహేష్ ను, ఇప్పుడు ఈ ట్వీట్ ఇరకాటంలో పడేసింది. జల్లికట్టు ఇచ్చిన స్ఫూర్తితో ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో సెలబ్రిటీలు, ప్రముఖులంతా భాగస్వామ్యులు అవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా చేరారు. పవన్ చేస్తోన్న చర్యలను సమర్ధిస్తూ మహేష్ బాబును ఏకరువు పెట్టారు. ప్రిన్స్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లతో హోరెత్తించారు. తమిళుల పండగ సంప్రదాయాలకు అంతగా సపోర్ట్ చేసే మహేష్, ఏపీ జీవనాడిగా భావించే స్పెషల్ స్టేటస్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తనను సూపర్ స్టార్ ను చేసిన తెలుగు ప్రజల ఆకాంక్షను వదిలి, డబ్బింగ్ మార్కెట్ పై దృష్టి పెట్టిన మహేష్ నిర్ణయం షాక్ కు గురిచేసిందని అన్నారు.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ తో ఏ సెలబ్రిటీ చేతులు కలపకపోయినా, వారు ఏపీకి క్రిమినల్ ద్రోహులేనని, పవన్ చేస్తోన్న పోరాటానికి సహకారం అందించాల్సిందిగా మహేష్ కు అభిమానులు తప్పకుండా చెప్పాలని, రాజకీయాలపై అంతగా ఆసక్తి లేకపోతే జల్లికట్టు కోసం ఎందుకు మహేష్ అంత ఆందోళన చెందారని, ఇదే సమయంలో ఏపీ ఇబ్బందులపై పవన్ పోరాటాన్ని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం గుప్పించారు. వర్మ ఇవి బహిరంగంగా చేస్తోన్న వ్యాఖ్యలే అయినా… సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ప్రశ్నల వర్షం మహేష్ పై కూరుస్తూనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories