అమెరికాలో మహేష్ బాబు కోసం రెక్కి!

mahesh babu vamsi paidipally movie shooting in USAమహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఓ సిన్మా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇదే మహేష్ బాబు కరీర్లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అమెరికా బేస్డ్‌ స్టోరీతో ఈ సినిమా రూపొందనుంది. వచ్చే సంవత్సరం మొదలు కావాల్సిన ఈ చిత్రం కోసం ఏ ఏ లోకేషన్లు బాగుంటాయోనని వంశీ అండ్‌ కో అమెరికాలో రెక్కీ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను’ చేస్తున్నారు మహేష్. ఈ చిత్రానికి సంభందించిన కొత్త షెడ్యూల్ ఏరోజు స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు లేని సీన్లు తీస్తున్నారు. తొందర్లోనే సూపర్‌స్టార్ జాయిన్ అవుతారు. పూజా హెగ్డే, రకుల్‌, శ్రుతి హాసన్ పేరులు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

‘భరత్‌ అనే నేను’ ఇది వరకు సంక్రాంతి 2018కి ప్లాన్ చేశారు. ఐతే ఇప్పుడు ఆ సినిమా వేసవిలో రానుంది. ఆ సినిమా విడుదలకు ముందే మహేష్ బాబు – వంశీ పైడిపల్లి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

ADVERTISEMENT
Latest Stories