ఏపీ బంద్ కు కత్తి మహేష్ మద్దత్తు

mahesh-kathi-participates in Andhra Pradesh bandhవివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ విజయవాడ చేరుకొని ఏపీ బంద్ కు తన మద్దత్తు ప్రకటించారు. లెనిన్ సెంటర్లో నిరసన తెలుపుతున్న కమ్యూనిస్టులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఖండించాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా అందరు కలిసి పోరాడాలని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాకోసం. విభజన హామీల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చెయ్యాలన్న పవన్ కళ్యాణ్ ప్రకటనకు ఆయన విమర్శించారు. “జనసేన నాయకత్వం. ఉండవల్లి, జేపీ లాంటి మేధావులతో కమిటీ. వినడానికి బాగుంది. చలసాని శ్రీనివాస్, హీరో శివాజి, వామపక్షాలు,ప్రజాసంఘాలు ఏర్పాటు చేసిన కమిటీ ఆల్రెడీ ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చి చేరితే బావుంటుంది,” అని ఆయన అన్నారు.

ADVERTISEMENT

మరోవైపు రాష్ట్రబంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైకాపా, కాంగ్రెస్‌, జనసేన పార్టీలతో సహా వివిధ సంఘాలు మద్దతు తెలుపుతూ బంద్‌లో పాల్గొంటున్నాయి. మరో వైపు టీడీపీ రాష్ట్ర బంద్ కు పరోక్షంగా మదత్తునిచ్చింది. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories