ట్రైలర్ విత్ ఎ ట్విస్ట్!

manasuku-nachindi-trialerసూపర్ స్టార్ కృష్ణ తనయురాలు మంజుల దర్శకత్వం వహించిన “మనసుకు నచ్చింది” సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో సినిమాకు తగినంత పబ్లిసిటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు పాల్గొనడంతో బజ్ పెరిగినట్లయ్యింది. సందీప్ కిషన్, దస్తూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను కూడా గతంలో మహేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే రిలీజ్ కు ఒక రోజు ముందు మరో ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ లో ఓ ‘ట్విస్ట్’ కూడా ఉందని ముందుగానే ప్రకటించి, సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ట్విస్ట్ ఏమిటి? అంటే… ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో కూడిన ట్రైలర్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో కూడా ప్రిన్స్ స్వరం వినేందుకు శాంపిల్ గా ఈ ట్రైలర్ రానుంది. ఇంతకంటే ‘ట్విస్ట్’ను అంటే… ప్రిన్స్ గెస్ట్ రోల్ మాత్రమే..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories