bhairavam-teaser

మంచు మనోజ్… బెల్లంకొండ శ్రీనివాస్… నారా రోహిత్… ఈ ముగ్గురి హీరోలకు విజయం అనే మాట విని ఎంత కాలం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ముగ్గురు కలిసి “bhairavam” అనే సినిమా చేశారు, తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా, వీక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

స్పష్టంగా చెప్పాలంటే… బహుశా ఈ ముగ్గురి హీరోలకు “భైరవం” ద్వారా ఒకేసారి బ్రేక్ లభిస్తుందేమో అన్న నమ్మకాన్ని టీజర్ ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అన్నదమ్ములుగా మంచు మనోజ్ మరియు నారా రోహిత్ లు కనిపించనుండగా, వారికి ఆంజనేయుడు మాదిరి శ్రీను క్యారెక్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ కే హైలైట్ గా నిలువగా, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ టీజర్ లో ఉన్న అదనపు ప్లస్ పాయింట్స్. తమిళ సినిమా “గరుడన్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోలు మాస్ గెటప్ లో కనిపించబోతున్నారు.




అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం” వంటి మాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ “భైరవం” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయం కోసం వేచిచూసున్న ఈ ముగ్గురి హీరోల భవితవ్యం ఫిబ్రవరి 21వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై తేలబోతోంది.

Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?