Mega Fans Allu Arjunఏషియన్ సంస్థతో జట్టుకట్టి అల్లు అర్జున్ నిర్మించిన మొదటి మల్టీ ప్లెక్స్ ఏఏఏ సినిమాస్ ఇవాళ అట్టహాసంగా మొదలైంది. మహేష్ బాబు ఏఎంబికి ధీటుగా ఇది నిలుస్తుందని సగటు మూవీ లవర్స్ దీని మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఓనిక్స్ ఎల్ఈడి స్క్రీన్ తో పాటు అత్యాధునిక సౌండ్ సిస్టమ్ తో కూడిన అయిదు తెరలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా బన్నీ సాధించిన అవార్డులతో పాటు సినిమాలకు సంబందించిన పోస్టర్లు, ఫ్యామిలీ ఫోటోలతో కూడిన గ్యాలరీ ని అందంగా పేర్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ మావయ్య చిరంజీవితో కలిసున్న ఒక్క ఫోటో అందులో లేకపోవడాన్ని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కుటుంబ ఆస్తి కాబట్టి అల్లు అరవింద్, బాబీ, శిరీష్ లను మాత్రమే హైలైట్ చేసి ఉండొచ్చు.

Also Read – స్మితా సభర్వాల్: ఈమెను ఎలా డీల్ చేయాలబ్బా!

కానీ గంగోత్రి రిలీజైనప్పుడు తొలినాళ్ళలో మద్దతు ఇచ్చింది మేమే కదాని చిరు ఫ్యాన్స్ లాజిక్. అయితే రెండో సినిమా ఆర్య నుంచే తనదైన స్టైల్, మేనరిజం, డాన్సులతో ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ప్రత్యేకంగా మెగాస్టార్ ఫోటో పెట్టకపోయినా ఇద్దరి మధ్య బంధం చెక్కుచెదరదని బన్నీ ఫాన్స్ డిఫెన్స్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే ప్రస్తుతానికి తాతయ్య పిక్ కూడా అక్కడ లేదు.

ఏఎంబిలో కూడా మహేష్ బాబు అవార్డులు, పోస్టర్లు ఉంటాయే తప్ప ప్రత్యేకంగా కృష్ణగారివి పెట్టలేదు. అలా అని రమేష్ బాబు లేదా సుధీర్ బాబు కుటుంబాలవి ఉంచలేదు. కేవలం తన వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఏఏఏ సినిమాస్ లో అల్లు బ్రదర్స్ ముగ్గురి పిక్స్ బాగా హైలైట్ అయ్యాయి.

Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!

అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ తో మొదలైన బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగాభిమానుల రచ్చ ఇప్పుడు కొత్తేమీ కాకపోయినా మరీ ఇంత లోతుగా శల్యపరీక్ష చేసేంత అంశం ఇందులో లేదని కొందరు నెటిజెన్లు అడుగుతున్నారు. ఇక్కడ ఎవరి వెర్షన్లలో వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది కానీ ఏఏఏ సినిమాస్ పూర్తిగా తన పర్సనల్ అనే సందేశమైతే బన్నీ స్పష్టంగా ఇచ్చాడు.

త్రివిక్రమ్, గుణశేఖర్, సుకుమార్, రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, రాఘవేంద్రరావు గారితో జ్ఞాపకాలనూ గ్యాలరీలో పొందుపరిచిన బన్నీ టీమ్ చిరుని విస్మరించడం తప్పా ఒప్పాని ఎవరూ నిర్ణయించలేరు. అయితే అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో ఎలాంటి పొరపొచ్చాలు లేవని తమ చర్యల ద్వారా అల్లు కొణిదెల కుటుంబాలు స్పష్టం చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు అనూహ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయి.

Also Read – విశాఖ మేయర్‌ పీఠం కూటమికే… సంతోషమేనా?