మెగాస్టార్’ను మెప్పిస్తాడా? షాక్ ఇస్తాడా?

Mega Star Chiranjeevi Movie with Puri jagganadhమెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలకు శుభంకార్డు పలికేసినట్లే. వరుస సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్న చిరు, తన తదుపరి సినిమాలను సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను దర్శకత్వాలలో చేయబోతున్నారు. అంతేకాదు, అన్ని కుదిరితే ఆ తర్వాత సినిమా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఉండబోతోంది. అవును… సెకండాఫ్ నచ్చలేదని పక్కనపెట్టిన “ఆటో జానీ” సినిమా కధపై మెగాస్టార్ ఇటీవల స్పందిస్తూ… ఈ ప్రాజెక్ట్ పై తానూ ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా సెకండాఫ్ కధ నచ్చలేదని అప్పుడే పూరీ జగన్నాధ్ కు చెప్పానని, తాజాగా ‘ఖైదీ నంబర్ 150’ విడుదలైంది గనుక, ఈ సినిమా చూసి దానికి అనుగుణంగా సెకండాఫ్ లో మార్పులు చేస్తే, ‘ఆటో జానీ’ సినిమా చేయడానికి తానూ రెడీ అంటూ ప్రకటించడంతో పూరీకి బంపర్ ఆఫర్ తగిలినట్లయ్యింది. అయితే ఎలాంటి హీరో అయినా తానూ అనుకున్నదే తీస్తారు తప్ప, హీరోల కోసం కధలను మార్చుకోవడం అనేది పూరీ నైజం కాదన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

‘ఇడియట్’ కధ క్లైమాక్స్ ను మార్చాల్సిందిగా పవర్ స్టార్ అడిగితే, అది నా వల్ల కాదని తెగేసి చెప్పి, రవితేజ ఆ సినిమాను తీసి స్టార్ హీరోగా మార్చిన పూరీ సినీ బయోగ్రఫీలో ఇలాంటి సంఘటనలకు కొదవలేదు. మరి అలాంటి పూరీ, మెగాస్టార్ చిరంజీవి కోసం తన “ఆటో జానీ” కధలో మార్పులు చేసి మెగాస్టార్ ను మెప్పిస్తారా? లేక అదే కధతో తెరకెక్కించి మెగాస్టార్ కు షాక్ ఇస్తారా? అన్నది వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories