గోపికి హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్!

Drunken Men Drive Mehrene Kaur Pirzada to Chennai @Fans Followingగోపిచంద్ కెరీర్ లో 25వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న “పంతం” సినిమా జూలై 5వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ ఏర్పాట్లలో భాగంగా నేడు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, ఈ వేడుకకు హీరోయిన్ మెహ్రీన్ హాజరు కాలేకపోతోంది. ఈమె గైర్హాజరుకు స్ట్రాంగ్ రీజన్ ఉందిలేండి.

వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నానని, ఈ కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నానని తెలిపిన మెహ్రీన్, జూలై 5వ తేదీన ధియేటర్లలో కలుద్ధామంటూ ట్వీట్ చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఆడియో వేడుకకు విచ్చేసి, ఆ రోజు రాత్రి అనేక ఇబ్బందులు పడుతూ తమిళ సినిమా కోసం మరుసటి రోజు చెన్నై వెళ్లి, ప్రొఫెషన్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటిచెప్పిన మెహ్రీన్ గైర్హాజరును అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories