రెళ్ల బెట్టారు. ‘వామ్మో! అంత స్పీడా!’ అని ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీశారు. అయితే ప్రమాదం జరిగింది తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి వివరించారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు.
అనంతరం బోయిన్ పల్లిలోని బెంజ్ షోరూంకు వెళ్లి అక్కడి మెకానిక్ లతో మాట్లాడారు. నిషిత్ కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికి బయటపడే అవకాశం ఉండేదని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్‌బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని, మితిమీరిన వేగం వల్లే నిషిత్ ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



