konda-surekha-criminal-case

తెలంగాణ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిత్యం ఎదో ఒక వివాదంలో ఉంటూ వార్తలలో నిలుస్తున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబం పై మొదలైన కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు నేటికీ నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నాయి.

Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!

తన రాజకీయ ప్రత్యర్థి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ వేసే ఉద్దేశంతో సమంత ను అడ్డుపెట్టుకుని అక్కినేని నాగార్జున కుటుంబం పై సభ్యసమాజం సిగ్గుపడేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చివరికి క్షమాణాలతో వివాదానికి ముగింపు పలికారు కొండా సురేఖ.

అయితే గౌరవ ప్రదమైన మంత్రి స్థానంలో ఉన్న మహిళ మరో మహిళ పై ఇలా నిరాధారమైన ఆరోపణలు చెయ్యడం, అక్కినేని కుటుంబాన్ని ఆ వివాదంలోకి లాగడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం సురేఖ వ్యాఖ్యల పై మండిపడ్డారు. చివరికి నాగార్జున సురేఖ పై పరువు నష్టం కేసు కూడా నమోదు చేసారు.

Also Read – వైసీపీలకి పవన్ వార్నింగ్… అబ్బే డోస్ సరిపోదు!

ఇక తాజాగా ఒక మంత్రి స్థానంలో ఉంటూ సురేఖ తన బంధువు బిడ్డ కోసం ఒక ఉద్యోగం ఉంటే చూడాలంటూ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ని అడిగిన దృశ్యాలు, మంత్రి గారు సరే చూద్దాం అంటూ ఇచ్చిన హామీల అంశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనితో కొండా సురేఖ చేసిన పని పై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి.

ఇక ఇప్పుడు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో వరంగల్ కృష్ణ కాలనిలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న కాలేజీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Also Read – కమ్మవారి ఊసు జగన్‌ కేల?

మంత్రులు తమ దగ్గరకు వచ్చిన ఫైల్స్ క్లియరెన్స్ కు డబ్బులు తీసుకుంటారని, కానీ నేను అలా డబ్బులు ఆశించకుండా తన దగ్గరకొచ్చిన ఫైల్స్ ను క్లియర్ చేస్తున్నానని, దానికి బదులుగా ఇలా సామజిక సేవ కార్యక్రమాలలో భాగమవ్వాలని కోరుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలతో సురేఖ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దీనితో కొండా వ్యాఖ్యలు అతికొద్ది సేపటికే వైరల్ అయ్యాయి.

ఇక దీని పై ఇటు సొంత పార్టీ నేతలు సైతం సురేఖ వ్యాఖ్యలు పై మండిపడుతున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు గమ్మునుంటారా.? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రేవంత్ సర్కార్ లోని మంత్రుల పని తీరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఇదే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి అలవాటు పడిపోయిన మంత్రి గారు ప్రస్తుతం ఆ పనిలో పడ్డారు. సురేఖ మరోసారి మీడియా ముందుకొచ్చి తన వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీల నేతలు వక్రీకరిస్తున్నారు, నేను బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రుల పని తీరు గురించి అలా చెప్పాను అంటూ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు.




అయితే సురేఖ ఇలా వరుసగా ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తరువాత నా ఉద్దేశం అది కాదు అంటూ సంజాయిషీలు చెప్పుకోవడం, క్షమాపణలు అడగడం ఆమెకు అలవాటులో పొరపాటుగా మారిపోయిందా అంటూ సొంత పార్టీల నేతలు సైతం మంత్రిగారి పై గుర్రుగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కూడా మంత్రి వ్యాఖ్యల పై సహనం వహిస్తారా.?