
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు మరో 5,000 ఎకరాలు సేకరించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. కానీ భూసేకరణ వలన రైతులకు నష్టపోతారని కనుక ల్యాండ్ పూలింగ్ చేయడమే మంచిదని స్థానిక ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారని, కనుక భూసేకరణ చేయడమా లేదా ల్యాండ్ పూలింగ్ చేయడమా అని చర్చిస్తున్నామని చెప్పారు.
“ఒకవేళ ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటే, అదనంగా మరో 30-40,000 ఎకరాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే ఆ భూములను అన్ని విదాలుగా అభివృద్ధి చేసి రైతులందరూ లాభపడేలా తిరిగి ఈయగలుగుతాము.
Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం
హైదరాబాద్‌లో విమానాశ్రయం కొరకు 5,000 ఎకరాలు సేకరించాలనుకున్నప్పుడు చాలా మంది అంత భూమి దేనికని ప్రశ్నించారు. కానీ హైదరాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసిన తర్వాత దాని చుట్టూ శరవేగంగా అభివృద్ధి చెందడంతో భూములు లేకుండా పోయాయి.
కనుక రాబోయే 50-100 సంవత్సరాలలో జరుగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే అమరావతిలో నిర్మించబోయే విమానాశ్రయం కొరకు 30-40,000 ఎకరాలు సేకరించవలసి ఉంటుంది,” అని మంత్రి నారాయణ చెప్పారు.
Also Read – ఆంధ్రాపై కేసీఆర్ ఎఫెక్ట్.. తగ్గేదెప్పుడు?
మంత్రి నారాయణ చెప్పిన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు రాబోయే 50-100 సంవత్సరాలలో జరుగబోయే అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్దం చేస్తుంటారు.
కనుక ఇప్పటి అవసరాలు, రాజధాని, జనాభా, రాజకీయ పరిస్థితిని బట్టి చూస్తే ఈ ప్రతిపాదన చాలా అసహజంగా అనిపిస్తుంది. గతంలో అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేస్తున్నప్పుడే అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
Also Read – పాకిస్థాన్‌కు ఓ యుద్ధం కావాలి.. భారత్ చేస్తుందా?
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందంటూ మంత్రి నారాయణపై కేసు నమోదు చేయించారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయనే మంత్రి అయ్యారు కనుక ఆ కేసు అటకెక్కిపోయుండవచ్చు.
కానీ రాజధాని అమరావతి కోసం 30-35,000 ఎకరాలు సరిపోయినప్పుడు, విమానాశ్రయం కొరకు అంత భూమి అవసరమా?కొత్తగా విమానాశ్రయం నిర్మించదలిస్తే రాజధాని కోసం సేకరించిన భూములలోనే కొంత కేటాయించి నిర్మించవచ్చు కదా?అనే ప్రశ్నలు వినిపించక మానవు.
ఒకవేళ ప్రభుత్వం 30-40,000 ఎకరాలు ఏవిదంగా సేకరించడానికి పూనుకున్నా ఆ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్దం అవుతోందని వైసీపీ ఆరోపించకుండా ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయకుండా ఉండదు.
గతంలో ప్రభుత్వం అమరావతి విషయంలో ఇదే విదంగా వ్యవహరించడం వలననే ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయలేకపోయింది. పైగా శాసనసభ, సచివాలయం, హైకోర్టుల కొరకు తాత్కాలిక భవనాల నిర్మాణానికి వేలకోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
వైసీపీ దుష్ప్రచారం వల్లనైతేనేమి, టిడిపి ప్రభుత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లనైతేనేమి రాజధాని పేరుతో ఏదో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలలో చాలా అనుమానాలు, అపోహలు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి ఇదీ ఓ కారణమైంది.
కనుక రాబోయే 50-100 ఏళ్ళ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఏదో చేసి నష్టపోవడం కంటే, 2029 ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ళు మాత్రమే గడువు ఉందనే సంగతి గుర్తుంచుకొని కూటమి ప్రభుత్వం ముందుగా అమరావతి, పోలవరం నిర్మాణ పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకొని మంచిదేమో? లేకుంటే చేజేతులా వైసీపీకి అవకాశం కల్పించిన్నట్లవుతుంది కదా?