రాష్ట్రాన్ని ముక్కలు చేసిన బిఆర్ఎస్‌ ఏపీలో ఎలా అడుగుపెడుతుంది?రోజా

Minister Rojaమంత్రి రోజా ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన బిఆర్ఎస్‌ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఏపీలో అడుగుపెడుతుంది? కొత్తగా రాష్ట్రం కావాలని కోరుకొనేవారే రాజధాని నిర్మించుకోవాలి. కానీ ఆనాడు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా హైదరాబాద్‌ నగరాన్ని తెలంగాణకి అప్పగించేసి, ఏపీకి తీరని అన్యాయం చేసింది. నేటికీ విభజన చట్టం ప్రకారం ఏపీలో రావలసినవి ఇవ్వనేలేదు. అటువంటప్పుడు బిఆర్ఎస్‌ ఏపీలో ఎలా అడుగుపెడుతుంది? ఒకవేళ బిఆర్ఎస్‌ ఏపీలో అడుగుపెడితే దానికి ఏవిదంగా బుద్ధి చెప్పాలో, దానిలో చేరేవారికి ఏవిదంగా బుద్ధి చెప్పాలో ప్రజలు సిద్దంగానే ఉన్నారు,” అని అన్నారు.

ఏపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని విలేఖరులు కోరగా ఆమె సమాధానం చెప్పకుండా ముందుకు సాగిపోయారు. కానీ విలేఖరులు గుచ్చిగుచ్చి అడగటంతో “ముందు వారి రాష్ట్రాన్ని చక్కబెట్టుకోమనండి,” అని సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.

ADVERTISEMENT

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇదివరకోసారి తిరుపతి వచ్చినప్పుడు రోజా ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. బయటకు వచ్చిన తర్వాత అదే విషయం ఆమె ఎంతో గర్వంగా చెప్పుకొన్నారు కూడా. కేసీఆర్‌ కుటుంబంతో ఇంత అనుబందం ఉన్న మంత్రి రోజా, ఆయన అధ్వర్యంలో ఏపీకి వస్తున్న బిఆర్ఎస్‌ని వ్యతిరేకిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు.

ఏపీకి రాజధాని లేకుండా కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే వైసీపీ దానిని సరిచేయవచ్చు కదా?హైదరాబాద్‌ని కుట్ర పూరితంగా తెలంగాణకి కేటాయించారని ఆరోపించిన ఆమె, తమ ప్రభుత్వం అమరావతిని కానీ, తామే స్వయంగా ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులను గానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదనే విషయం ప్రస్తావించకుండా విభజన సమస్యల గురించి మాట్లాడారు.

ADVERTISEMENT
Latest Stories