చంద్రబాబుపై అలుపెరుగని పోరాటం చేసిన జగన్ టిక్కెట్టు లేదంటున్నారా?

Alla Ramakrishna Reddyఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం. సొంత నియోజకవర్గంలో రాజధాని ఏర్పాటు చేసినా పార్టీ మీద ఉన్న ప్రేమతో దానిని వ్యతిరేకించిన రైతులను భూములు ఇవ్వకుండా చెయ్యడం, రాజధానిపై కోర్టుకు వెళ్ళడం లాంటివి చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సదావర్తి భూముల విషయమైనా, ఓటుకు నోటు కేసైన అవన్నీ అధినేత మెప్పు కోసం ఆళ్ల వేసినవే.

ADVERTISEMENT

సహజంగా చంద్రబాబును దూషించేవారైనా, ఇబ్బంది పెట్టే వారైనా జగన్ కు ఎంతో ఇష్టం. కాకపోతే ఆళ్లకు మాత్రం ఈ సరి టిక్కెట్టు లేదని అంటున్నారంట. కారణం రాజధానిని వ్యతిరేకించడంతో అక్కడ ఆయన గెలిచే అవకాశం లేదంట. అయ్యో మీ కోసమేగా వ్యతిరేకించిందని ఆళ్ల లబోదిబో అంటున్నారంట.

మరోవైపు ఈ మధ్యనే ఆయన ఒక కేసులో కూడా ఇరుక్కున్నారు. దాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు బినామీగా రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఏసీబీకి ఆధారాలు లభించాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని స్థిరాస్తి పత్రాలు ఆళ్ల కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు సమాచారం. ఈరోజు ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరైనారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని 3 గంటలకుపైగా ఏసీబీ అధికారులు విచారించారు.

ADVERTISEMENT
Latest Stories