గవర్నర్ ను సాగనంపే ప్రయత్నమా?

Governor ESL Narasimhanగవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ యూపీఏ ప్రభుత్వం టైములో నియమించబడిన గవర్నర్. ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరిని తీసేసి తమ వారిని నియమించుకున్నారు. అయితే నరసింహన్ ను మాత్రం ముట్టుకోలేదు. తన రెండో టర్మ్ కూడా పూర్తి అయిపోయినా ఇంకా కొనసాగుతున్నారు.

అయితే ఒకప్పుడు తెలంగాణా వ్యతిరేకి అనిపించుకున్న గవర్నర్. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా సన్నిహితం అయిపోయారు. ఇదే ఇప్పుడు ఆయనకు తలపోట్లు తెచ్చిపెడుతుంది. ఇటీవలే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మీద ఏదో కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంను వెనకేసుకుని వచ్చారట.

ADVERTISEMENT

దీనితో రాజ్ భవన్ లోనే కాంగ్రెస్ నాయకులు ఆయనను విమర్శించారు. మరోవైపు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇదివరకు చేసిన విమర్శలను కట్టడి చేసే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు బీజేపీ. తాజాగా ఆయన మరోసారి గవర్నర్ పై విరుచుకుపడ్డారు.

గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? అని ప్రశ్నించారు. ఏపీలో పట్టుమని వారం రోజులైనా ఉన్నారా? అని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ కావాలని… పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కేంద్రాన్ని కోరాలని, తాము కూడా కేంద్రం, బీజేపీ అధిష్టానాన్ని కోరతామని విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఈ విమర్శలు ఏమైనా గవర్నర్ ను సాగనంపే ప్రయత్నమా?

ADVERTISEMENT
Latest Stories