వైసీపీ ఎమ్మెల్సీ ఒక్క హత్య… ఎన్నో ప్రశ్నలు!

MLC Anantha Babu case so many questionsవైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి 20 రోజులైంది. కానీ ఇంతవరకు పోలీసుల దర్యాప్తు పూర్తి కాలేదు. అతనితో పాటు ఇంకెంతమంది ఈ హత్యలో పాల్గొన్నారో తేల్చనేలేదు. ఎవరినీ అరెస్ట్ చేయలేదు. పైగా ఏదో విదంగా అనంతబాబుని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు పోలీసులే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు సుబ్బారావు ఆరోపించారు.

ఆయన ఈరోజు రాజమండ్రి ప్రెస్‌క్లబ్బులో మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు పలు ప్రశ్నలు సందించారు. అవన్నీ యదాతదంగా చెప్పుకోవాలంటే ఓ పుస్తకమే ప్రచురించాల్సి ఉంటుంది. కనుక క్లుప్తంగా ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో తెలుసుకొందాం.

ADVERTISEMENT

· అనంతబాబు ఒక్కడే ఈ హత్య చేశాడంటారు. కానీ ఎఫ్ఐఆర్‌లో అనంతబాబుతో పాటు మరికొందరు ఉన్నారని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొత్తం ఎంత మంది పాల్గొన్నారు? వారి వివరాలు పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు. అసలు ఇంతవరకు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

· డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒంటిపై 31 గాయాలు, అంతర్గతంగా మూడు తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. అనంతబాబు ఒక్కడే ఇన్ని గాయాలు చేయగలడా?ఒకవేళ గాయపరిచి ఉంటే ఆయన ఒక్కడే అతని మృతదేహాన్ని మోసుకొని తీసుకురాగలరా?

· పోలీసులు కోర్టుకు సమర్పించిన అరెస్టు మెమోలో అనంతబాబుకి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. కానీ 2014లో అనంతబాబుపై అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది కదా? దానిని అరెస్టు మెమోలో ఎందుకు పేర్కొనలేదు?

· అనంతబాబుపై పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉన్నప్పుడు వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చింది?చట్టసభలలో ఇలాంటివారున్నప్పుడు ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి సామాన్యుల మానవహక్కులు ఏవిదంగా కాపాడగలరు?

· సెక్షన్ 164 ప్రకారం ఇంతవరకు మేజిస్ట్రేట్ ముందు సాక్షుల వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదు?

ADVERTISEMENT
Latest Stories