అద్దె అడిగినందుకు చెప్పుతో కొట్టిన ఎమ్మెల్సీ

MLC Farooq Hussain Slapped NRI Womanరాజుకు కోపం వస్తే దెబ్బలకు కరువా? రాజరికం పోయిన ఏరోజు రేపు మన ప్రజాస్వామ్యంలో కూడా ఇదే తంతు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ తనపై దాడి చేశాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ హైదరాబాద్‌ నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నాంపల్లిలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఫరూక్‌ హుస్సేన్‌ ఆరేళ్లుగా ఉంటూ అద్దె ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని బాధితురాలు హంతుల్‌ వాసే పేర్కొన్నారు. ఆమె న్యూయార్క్‌ నుంచి వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చి తన నివాసంలో ఉంటున్న ఎమ్మెల్సీని అద్దె అడిగినందుకు తనపై చెప్పుతో దాడి చేశారని ఫిర్యాదులో వివరించారు.

ADVERTISEMENT

తనపై దాడికి పాల్పడిన ఫరూక్‌ హుస్సేన్‌పై చర్యలు తీసుకొని తన ఇంటిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను కోరారు. దీనిపై ఎమ్మెల్సీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఐతే ముఖ్యమంత్రి దీనిపై ఏమీ యాక్షన్ తీస్కుంటారో చూడాలి మరి.

ADVERTISEMENT
Latest Stories