
ప్రధాని మోడీ మే 12న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఊహించినట్లే పాక్ తనదైన శైలిలో స్పందించింది.
Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?
“మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నప్పటికీ ఉల్లంఘించామని తప్పుడు ఆరోపణలు చేస్తూ భారత్ మాపై దాడులు చేసింది. అయినప్పటికీ ఇరుదేశాల మద్య శాంతి నెలకొల్పేందుకు మేము చాలా సంయమనం పాటిస్తున్నాము.
కానీ మే 12న ప్రధాని మోడీ తన ప్రసంగంతో భారత్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. కాల్పుల విరమణ గురించి అబద్దాలు చెప్పారు. పాక్‌ని కించపరుస్తూ, బెదిరిస్తూ, కవ్వించే విదంగా ఆయన మాట్లాడారు. ఇది చాలా ప్రమాదకరం.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
భారత్‌తో మేము యుద్ధం కోరుకోవడం లేదు. శాంతియుతంగా సమస్యలని పరిష్కరించుకోవడానికే పాక్ మొగ్గు చూపుతోంది. కానీ మళ్ళీ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా పాక్ ధీటుగా జవాబిస్తుంది. భారత్‌ని నిశితంగా గమనిస్తున్నాము,” అని ప్రముఖ పాక్ పత్రిక డాన్ పేర్కొంది.
భారత్ దాడులలో పాక్ స్క్వాడ న్ లీడర్ యూసఫ్ షహీద్‌తో సహా మొత్తం 11 మంది చనిపోయారంటూ వారి ఫోటోలు ప్రచురించింది. కానీ ఆ దాడులలో తమ సైనిక, వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయనే విషయం ప్రస్తావించలేదు.
Also Read – శ్యామల చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి..!
పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని, అక్కడే ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థని తమ క్షిపణులతో నేలమట్టం చేశామని పాక్ గొప్పలు చెప్పుకుంది. పాక్‌కు జవాబుగా ప్రధాని మోడీ నిన్న అక్కడ పర్యటించి అక్కడ ఉన్న యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థ ముందు వాయుసేన సిబ్బందితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాక్ అబద్దాలు చెపుతోందని నిరూపించి చూపారు.
పాక్‌ని చావు దెబ్బ తీసి మళ్ళీ ప్రయత్నిస్తే మరోసారి చావు దెబ్బ కొడతామని ప్రధాని మోడీ హెచ్చరించగా, తమ కీలక సైనిక, వైమానిక స్థావరాలు ధ్వంసమైనా భారత్‌ని నిశితంగా గమనిస్తున్నామని, భారత్ దుందుడుకుగా వ్యవహరిస్తే ధీటుగా ఎదుర్కొంటామని పాక్ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఒకవేళ భారత్ దాడుల వలన పాక్‌కి తీవ్ర నష్టం జరుగకుంటే, భారత్‌తో ఇంకా యుద్ధం కొనసాగిస్తూ ఉండేదే తప్ప కాల్పుల విరమణకు అంగీకరించేది కాదు కదా?