మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ హైదరాబాద్ వాడైన నార్త్ పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన సేవలు అక్కడే ఎక్కువ వాడుకుంటుంది. ఐతే ఆయనను తెలంగాణాకు తీస్కొచ్చే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా తెలంగాణాలోని ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవాలి అనేది వ్యూహం.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అజారుద్దీన్ కు మీడియా ముఖంగా ఆహ్వానం పలికారు. “వచ్చే ఎన్నికల్లో అజారుద్దీన్ తెలంగాణనుంచి పోటీ చేయాలి. ఎక్కడి నుంచైనా టికెట్ ఇచ్చేందుకు మేం సిద్ధం,” అని ఉత్తమ్ మీడియా ముఖంగా ఆహవానం పలికారు. దీనికి అజారుద్దీన్ ఏమంటారో చూడాలి.
తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అన్ని విధాల ట్రై చేస్తుంది. ముస్లిం ఓటర్ల కోసం అజారుద్దీన్ ను, రెడ్డి కులస్థులను ఆకట్టు కోవడానికి రేవంత్ రెడ్డిని వాడుకోవాలని ఆ పార్టీ ప్రయత్నం. మరి కాంగ్రెస్ పాచిక 2019 ఎన్నికల్లో పారుతుందో లేదో చూడాలి.


