మార్చి 2 నుంచి మూతపడనున్న సినిమా థియేటర్లు!

Increase of ticket price in theatresపల్లె నుంచీ నగరందాకా దాదాపు అన్ని సినిమా థియేటర్లులో ఫిలిం ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ సినిమా ప్రొజెక్టర్ కు అప్ డేట్ అవడంతో డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓ వంటి సంస్థలు డిజిటల్‌ ప్రొజెక్టర్ల ద్వారా సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. డిజిటల్ ప్రొవైడర్స్ గా ఉన్న క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలు ప్రతి ఏడాది ధరలు పెంచుకుంటూనే పోతున్నారు. దీంతో పెద్ద సినిమాలు లతో పాటు చిన్న సినిమాలు విపరీతంగా నష్టాలపాలవుతాన్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల ద్వారా క్యూబ్‌, యూఎఫ్‌వో వసూలు చేస్తున్న అధిక ధరలను తగ్గించాలని నిర్మాతల మండలి డిమాండ్ చేసిన వారి నిర్ణయాన్ని క్యూబ్, యూఎఫ్ఓ అంగీకరించడం లేదు. దీంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్, నిర్మాతలు అంతా కలిసి ఏర్పాటు అయిన జాయింట్ యాక్షన్ కమిటీ మార్చి 2 నుంచి డిజిటల్ వారికి కంటెంట్ ఇవ్వకుండా సౌత్ ఇండియా థియేటర్లు లో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories