
కిర్లంపూడి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటి పై జరిగిన దాడి ఘటన మీద ఆయన కుమార్తె జనసేన మహిళా నేత క్రాంతి స్పందించారు. ఈ ఘటన మీద సమగ్ర విచారణ చేపట్టి తెర వెనుక ఉన్న బడా దోషులను తెరముందుకు తేవాలంటూ వ్యాఖ్యానించారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
అలాగే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ముద్రగడ ఇంటి మీద జరిగిన దాడికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అసలు సూత్రధారులను పట్టుకోవాల్సిన బాధ్యత, ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ అధికారులను కోరారు.
అయితే ఒక్కసారి క్రాంతి వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ దాడి వైసీపీ వ్యూహంలో భాగమేనా అన్న సందేహాలు కలుగక మానవు. అలాగే ఈ దాడి మీద స్పందించిన టీడీపీ ఎంపీ సానా సతీష్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ గత చరిత్రను జ్ఞప్తికి తెచ్చారు.
Also Read – వన్ నేషన్…వన్ ఎలక్షన్…వన్ పార్టీ.?
గన్ని శెట్టి గంగాధర్ అనే వ్యక్తి తాగిన మత్తులో ట్రాక్టర్ లో వచ్చి కిర్లంపూడి లోని ముద్రగడ ఇంటి ముందు ఆగిఉన్న కారును ఢీ కొట్టి, గోడ మీద ఉన్న కొన్ని ఫ్లెక్సిలను ధ్వంసం చేసారు. దీనితో ఇది జనసేన పనే అంటూ స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే సానా సతీష్ మాత్రం గంగాధర్ ఒకప్పుడు ముద్రగడ అనుచరుడేనని, అది వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వివాదం నేపథ్యంలో జరిగిన ఘటన గానే భావించాలన్నారు. అలాగే వైసీపీ ఘోర ఓటమితో ఇలాంటి చిప్ ట్రిక్స్ చేస్తూ స్థానికంగా సమస్యలను సృష్టించి తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
దీనితో ఇలా స్వీయ దాడుల సంస్కృతీ వైసీపీ కి అలవాటే అంటూ వైసీపీ గత దాడుల డ్రామాలైన కోడికత్తి, గులకరాయి సంఘటనలను, వివేకా హత్య లో టీడీపీ మీద వేసిన నిందారోపణలను మరోసారి సోషల్ మీడియా వేదికలో వైరల్ అవుతున్నాయి. అయితే ముద్రగడ ఇంటి మీద జరిగిన దాడి విషయంలో వైసీపీ ఆరోపణలు మీద కన్నా వైసీపీ మీదే అందరికి అనుమానులు కలగడం బహుశా ఆశ్చర్యాన్ని కలిగించలేదేమో.