వెంటిలేటరుపై ముద్రగడ… పట్టించుకునే నాధుడు లేడు!

Mudragada Padmanabham's Health Crisis Sparks Political Debate

ముద్రగడ పద్మనాభ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు చివరికి అయన పరిస్థితి ఏమయిందో అందరికీ తెలుసు. ఆయన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ తన తండ్రిని పట్టించుకునే నాధుడే లేడని ముద్రగడ కుమార్తె క్రాంతి బర్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు.

“జగన్మోహన్ రెడ్డి కోసం మా నాన్నగారు తన పేరు కూడా మార్చుకున్నారు. గత పది రోజులుగా వెంటిలేటరుపై ఉన్న నా తండ్రిని జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. మా తండ్రిగారికి జగన్‌, వైసీపీ నేతలు ఇచ్చే విలువ ఇదేనా?” అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి బర్లపూడి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

అయితే జగన్‌ కోసం పని చేసి నష్టపోయిన వారిలో ముద్రగడ మొదటివారు కారు. చివరి వారు కారు. విజయసాయి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలు వాలంటీర్ల వరకు చాలా మందే ఉన్నారు.

అయితే వారందరూ జగన్‌ వల్లనే నష్టపోయారని చెప్పలేము. వారిలో కొంత మంది దురాశ, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడటం వలన కేసులలో చిక్కుకోగా, ముద్రగడ వంటివారు గుడ్డిగా నమ్మి నష్టపోయారు.

అదే… పవన్ కళ్యాణ్‌ని నమ్ముకొని అయన వెంట నడిచినవారికి ఎమ్మెల్యే, ఎంపీలయ్యారు. కొందరిని మంత్రి పదవులు, సమాజంలో గౌరవమర్యాదలు కూడా లభిస్తున్నాయి. కనుక రాజకీయాలలో ఉన్నవారు ఎవరి వెంట నడుస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. అదే వారి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంటుంది.

ముద్రగడ విషయానికి వస్తే, అయన కుమార్తె క్రాంతి జనసేనలోనే ఉన్నారు కనుక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి తండ్రికి అవసరమైన వైద్య సహాయం అందేలా చేస్తే అందరూ సంతోషిస్తారు.

ఒకవేళ అధికార, విపక్షాలు ఏ కారణంతో పట్టించుకోకపోయినా, ఆయన కాపుల కోసం ముద్రగడ చాలా పోరాడారు కనుక కనీసం ఆ సామాజిక వర్గంలో వారైనా అయనకు సహాయపడితే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories