కొత్త ఏడాది పెద్దాయన పెద్ద నిర్ణయం…!

Mudragada Padmanabham

అధికార పార్టీ వైసీపీ నుండి పక్క పార్టీలకు వలస వెళుతున్న నాయకులు కొందరైతే, అధికార పార్టీ వైసీపీ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొందరు మాజీలు ముందుకొస్తున్నారు.అయితే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో కి రాగ ఇప్పుడు మరో మాజీ కూడా అదేకోవలోకి చేరారు.

ADVERTISEMENT

కాపు ఉద్యమ నేతగా, కుల పెద్దగా చెప్పుకునే ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. దీనితో ఆయన తన నివాసంలో అనుచరులతో భేటీ అయ్యి తన నిర్ణయం పై చర్చలు జరుపుతున్నారు.మొదటి నుండి తేరా వెనుక జగన్ కు ఆత్మీయుడిగా వ్యవహరిస్తున్న ముద్రగడ ఇక తేరా ముందు జగన్ కు తన సహకారం అందించడానికి రెడీ అయినట్లే.

కొత్త సంవత్సరం, కొత్త నిర్ణయాన్ని ప్రకటించడానికి ముద్రగడ రెడీ అయ్యారని, తమ కుమారుడు గిరిబాబుకు వైసీపీ టికెట్ హామీతో పెద్దాయన ఈ ఏడాది పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ముద్రగడ అనుచరులు స్థానికంగా హడావుడి మొదలుపెట్టారు. కుల పరంగా జనసేనకు పడే ఓట్లను చీల్చి పవన్ ను రాజకీయం గా మరోసారి దెబ్బకొట్టడానికే జగన్ ఈ పెద్దాయనను రాజకీయాలలోకి రీఎంట్రీ చేస్తున్నారని జనసైనికుల ఆరోపణ. మొత్తానికి మాజీలకు వైసీపీ పార్టీ ఒక ఫ్లాట్ ఫామ్ గా మారిందనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories