రిజర్వేషన్ల ఉచ్చు తెరాస మెడకు చుట్టుకుంటదా?

Muslims Reservation controversy to TRSఎన్నికల్లో తెరాస గెలిస్తే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. నాలుగు నెలలు కాకపోయినా ఆమేరకు అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పటికే రేజర్వేషన్లు 50% ఉండటంతో మరింత పెంచడానికి కేంద్రం అనుమతి అవసరం. అయితే కేంద్రం ఒప్పుకునే పరిస్థితి లేదు.

ADVERTISEMENT

దీనిని తమకు అనుకూలంగా మార్చుకుందామని చూస్తుంది కాంగ్రెస్. 2019 నాటికి ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే తెలంగాణ రాస్ట్ర సమితికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తెరాస గెలిస్తే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

కానీ ఇప్పుడు నాలుగు కాదు 40 నెలలు గడిచినా రిజర్వేషన్లు కల్పించలేదని ఆయన అన్నారు. ఎన్నికల హామీని ఎందుకు నెరవేర్చడంలేదని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో తమ మద్ధతుతోపాటు ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ వారితో కలిసి వెళ్తే ఇచ్చేది కూడా ఇవ్వరు మోడీ!

ADVERTISEMENT
Latest Stories