మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తున్నారు. ఆయన సినీనటుడు హిందూపూర్ తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తునట్టు సమాచారం. మొన్న ఆ మధ్య ‘బాలయ్య ఎవరో నాకు తెలియదు’ అనేశారు నాగబాబు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నా ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు… బాలయ్య తగులుకునే వరకు ఆయన ఆగేలా లేరు.
[m9ad]
ఇప్పుడు తాజాగా కొన్ని దున్నపోతులు, కుక్కల ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు, ఆ ఫొటోల్లోని జంతువుల బ్రీడ్స్, బ్లడ్ ‘రేర్’ అని చెప్పుకొచ్చారు. కావాల్సిన వారు కొనుకోండి అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో అర్ధం కాకపోయినా ఆయన మళ్ళీ బాలయ్య ను టార్గెట్ చేస్తున్నారని అర్ధం అవుతూనే ఉంది. మొన్న ఒక సందర్భంలో ‘మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు..’ అని చెబుతాడు బాలయ్య బాబు. దానికి కౌంటర్‌గా నాగబాబు ఇప్పుడిలా సోషల్ మీడియాలో.
జనసేనాని ప్రసన్నం చేసుకోవడానికి ఇవన్నీ నాగబాబు తిప్పలు లా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తే ఆయన కనికరిస్తారని ఆయన కోరిక కావచ్చు. అయితే అభిమానుల మెప్పుకోసమే సోషల్ మీడియాలో ఇలా హద్దులు దాటేస్తున్నారా.? అన్న అనుమానాలు ఎవరికైనా కలగడం సహజమే. కానీ రాజకీయాలలోకి రావాలనుకుంటే రాజకీయం చెయ్యాలి గానీ ఇలాంటి చిల్లర వివాదాలలోకి వెళ్తే ఎవరు హర్షించరు. పైగా బాలయ్య తనదైన శైలిలో తగులుకుంటే అనవసరంగా అది రెండు వర్గాల మధ్య చిచ్చు గా మారొచ్చు.



