‘మౌనవ్రతం’ వీడిన నాగచైతన్య… ‘పెళ్లి కబురు’ ప్రకటన..!

naga-chaitanya-samantha-marriage-dateఇన్నాళ్ళ వరకు తన పెళ్లిపై ‘మౌనవ్రతం’లో ఉన్న అక్కినేని నాగచైతన్య, దానిని బ్రేక్ చేస్తూ తొలిసారిగా పెళ్లి వార్తను అందించాడు. చైతూ పెళ్లిపై సమంత, నాగార్జునలతో సహా అందరూ ఏదొక సందర్భంలో స్పందించగా, పెళ్లికొడుకు మాత్రం నోరు మెదకపకపోవడంతో… చైతూ ‘మౌనవ్రతం’ గురించి చర్చలు జరిగాయి. అయితే ఫస్ట్ నోరు విప్పిన చైతూ… తన పరిణయ సమయం మాత్రమే చెప్పారు.

‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాను గానీ, తేదీ ఎప్పుడనేది ఇంకా ఆలోచించలేదని’ చైతూ స్పష్టం చేసారు. ఈ వార్తను కింగ్ నాగార్జున ఇప్పటికే చెప్పినప్పటికీ, దానిని చైతూ ధృవీకరించారు. చెన్నైలో సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చైతూ పెళ్లి వార్తలు రాగా, దీనిపై అలా ప్రతిస్పందించారు. ‘ప్రేమమ్’ సినిమాతో బిజీగా ఉన్న చైతూ, ఎప్పుడూ పూర్తయిన ‘సాహాసం శ్వాసగా సాగిపో’ విడుదలపై కూడా దృష్టి కేంద్రీకరించారు.

ADVERTISEMENT

మరో వైపు సమంత చేతిలో ఉన్న ఒక్క తమిళ సినిమా కూడా ఈ ఏడాది చివరకు ముగియనుండడంతో, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వీరిద్దరి పరిణయం ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే అఖిల్ నిశ్చయ తాంబూలం డిసెంబర్ లో ఫిక్స్ చేయడంతో, ఈ లోపున చైతూ వివాహ తేదీపై కూడా పూర్తి స్పష్టత రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories