అమ్మాయిలు వెనుక బాగా పడేవాడ్ని – చైతూ!

naga_chaitanyaటాలీవుడ్ టాప్ హీరోయిన్ ‘కుందనపు బొమ్మ’ సమంతతో తన ప్రేమ వ్యవహారం గురించి తన తల్లి లక్ష్మికి చెప్పేందుకు సరైన సమయం కోసం చాలా రోజులు వేచిచూశానని… అక్కినేని నటవారసుడు నాగచైతన్య అన్నాడు. ఎందుకంటే, మా అమ్మ అంటే నాకు కొంచెం భయం, అందుకని, చాలా రోజులు ఆగిన తర్వాత ఈ విషయం చెప్పాను, అయినా, మా అమ్మ నాకు చాలా సపోర్ట్ గా నిలిచింది. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అమ్మ చాలా అండగా ఉండేది… అంటూ తన ప్రేమ విషయంలో అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని తెలిపాడు చైతూ.

ఇక, తన ప్రేమికురాలు సమంత గురించి చెప్తూ… “నా కెరీర్ లో ఇప్పటివరకు ‘ప్రేమమ్’ చిత్రమే నా బెస్ట్ పర్ఫామెన్స్ చిత్రమని సమంత చెప్పింది” అంటూ సంబరపడిపోతున్నాడు. ఏ విషయమైనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే సమంత, సినిమాల విషయంలోనూ బాగున్నా, లేకున్నా అలాగే చెప్పేస్తుందని, అయితే ‘ప్రేమమ్’ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని చెప్పిందని అన్నాడు. ప్రేమమ్ చిత్రంలో టీనేజ్ కు సంబంధించిన సన్నివేశాలను చాలా బాగా ఎంజాయ్ చేశానని, ఎందుకంటే, ఇటువంటి సంఘటనలు తన జీవితంలో చాలా జరిగాయని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

తన రియల్ లైఫ్ లో ఎటువంటి సంఘటనలు ఉన్నాయో, ‘ప్రేమమ్’ చిత్రంలో కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయని, ‘ప్రేమమ్’ చిత్రంలో స్కూల్, కాలేజీ, కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత లవ్ గురించి ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాలో కాలేజీలో చదువుకునే రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడే సీన్ ఉంటుందని, ఆ ఒక్క సంఘటనే తన నిజజీవితంలో మిస్ అయిందని, మిగిలిన రెండు సంఘటనలు తన రియల్ లైఫ్ లో ఉన్నాయని చెబుతూ చిరునవ్వులు చిందించాడు. స్కూల్ రోజుల్లో అమ్మాయిల వెనక బాగానే పడేవాడిని తన బాల్య స్మృతులను తలచుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories