sobhita-dhulipala-akkineni-naga-chaitanya-engagement-date

అక్కినేని ఇంట పెళ్లి సందడి షురూ అంటూ సోషల్ మీడియాలో వినిపించిన వార్తలకు నాగార్జున అధికారిక ముద్ర వేశారు. అక్కినేని వారసుడు నాగ చైతన్య, నటి శోభిత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటి మీద చై కానీ శోభిత కానీ ఎప్పుడు స్పందించలేదు.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

అయితే ఈ ఊహాగానాలకు తెర దింపుతూ ఈ రోజు ఉదయం 9 గంటల 42 నిముషాలకు తన కుమారుడు నాగ చైతన్యకు, శోభిత దూళిపాళ్ల కు నిచితార్థం జరిగినట్లు నాగార్జున తన X లో చై, శోభిత తో కలిసి ఉన్న పిక్ ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికీ జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అంటూ శోభితను అక్కినేని కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాం అని తన ఆశీస్సులు అందచేశారు నాగార్జున.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.


చై, శోభిత నిచితార్థం అన్న వార్తలతో సోషల్ మీడియా అంతటా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే కొత్త జంటకు అంతా మంచి జరగాలని, వారి జీవితం ఆనందంగా ముందు సాగాలని M 9 తరుపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.