జనసేన పార్టీకి నాగబాబు ప్రచారం ముమ్మరం చేశారు. జనసేనకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన నుండి ఆయన ఆ గాజు గ్లాసు పట్టుకుని తిరుగుతున్నారు. ఈసారి ఏకంగా ఆయన జనసేన పార్టీ అధికారిక ఛానల్ లోనే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన గురించి మీ అబిప్రాయం ఏమిటని అడిగితే చెత్త అని బదులు ఇవ్వడం విశేషం. అసలు నాగబాబు ఈ నాలుగున్నర ఏళ్ళలో ఎన్ని సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉంటారో?
[m9ad]
టిడిపి నేతలు కొందరు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అడిగితే ఏరు దాటి తెప్పతగలేస్తున్నారని ఆయన అన్నారు. అదే క్రమంలో తాను జనసేన కార్యకర్తను కాదని, అభిమానినని చెప్పుకొచ్చారు ఆయన. సైకిల్, ఫ్యాన్ లేని ఇల్లు ఉండవచ్చు కాని, గ్లాస్ లేని ఇల్లు ఉండదని ఆయన అన్నారు. అయితే నాగబాబు చేసిన ఈ కామెంటుపై సోషల్ మీడియా జోకులు వేస్తున్నారు. ఫ్యాన్ లేని ఇల్లులు ఉన్నాయని అనుకుంటున్నారంటే నాగబాబు ఈ కాలంలో ఉన్నారు అని వైకాపా అభిమానాలు కామెంట్ చేస్తున్నారు.
సైకిల్ నేర్చుకోని వారు ఎవరుంటారని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు. అయినా సైకిల్ తొక్కామని టీడీపీకి, చెయ్యి ఉందని కాంగ్రెస్ కి, ఫ్యాన్ తిరుగుతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఇంట్లో టీ గ్లాసు ఉందని జనసేనకు ఓటు వేసేస్తారా అని జోకులు వేస్తున్నారు. మరో వైపు నాగబాబు ఈ ప్రచారం వల్ల జనసేనకు లాభం చేకూర్చకపోగా నష్టం చేయ్యవచ్చని కొందరు భావిస్తున్నారు. “జనసేన మీద మెగా ఫ్యామిలీ ముద్ర పడకూడదని, ప్రజారాజ్యం పార్టీ గుర్తు రాకూడదని పవన్ చాలా కష్ట పడ్డారు. ఇప్పుడు నాగబాబు దానిని చెడగొడుతున్నారు,” అని వారి అభిప్రాయటం.
కొందరు ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీని జనసేనలోకి తీసుకొచ్చే ప్రయత్నమా ఇది అని అనుమానిస్తున్నారు. నాగబాబు వెంట చిరంజీవి కూడా జనసేనలోకి వస్తారా అనేది చూడాలి. గత కొంత కాలంగా చిరంజీవి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అన్న తో విబేధించా అని పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతున్న ఆయన ఎప్పుడూ ప్రజారాజ్యం పార్టీ విలీనం విషయంలో ఆయన తప్పు ఏమీ లేదన్నట్టుగానే మాట్లాడారు. దీనితో చిరంజీవి రాకకు మార్గం సుగమం చేస్తున్నారా అనేది చూడాలి.



