ఇదేం గొడవ…. ఎక్కడా సేఫ్ కాదు

nagachaitanya thankyou movie latest updateయువ సామ్రాట్ నాగ చైతన్య థాంక్ యు బృందం వారి చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది. ఇటలీలో కోవిడ్ కేసులు తక్కువగా ఉండటంతో అక్కడ షూటింగ్ సురక్షితం అని వారు భావించారు, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మహమ్మారి పరిస్థితి కారణంగా అనేక దేశాల నుండి భారతదేశానికి విమానాలు రద్దు చేయబడుతున్నందున ఈ బృందం తిరిగి హైదరాబాద్ వస్తుంది.

కాబట్టి, బృందం రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడక… హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యింది చిత్రబృందం. ఇది సినిమా చివరి షెడ్యూల్ కావాల్సి ఉంది. ఇప్పుడు మధ్యలో తిరిగి రావాల్సి ఉండటంతో భారతదేశంలో పరిస్థితులు క్లియర్ అయిన తర్వాత వారు ఇటలీకి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది.

ADVERTISEMENT

మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు మరి విక్రమ్. అయితే మనం తరువాత విక్రమ్ కు ఆ స్థాయి సినిమా రాలేదు. అసలైతే అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. దీనితో కసిగా పని చేస్తున్నట్టు సమాచారం.

ఈ చిత్రం కోసం అతను మొదటి సారిగా బయట కథతో సినిమా చేస్తున్నాడు. రైటర్ – దర్శకుడు బీవీఎస్ రవి కథ ఇస్తున్నాడు. గతంలో జోష్ అనే సినిమాతో నాగచైతన్యను పరిచయం చేసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఇండస్ట్రీలోని ప్రతీ చిత్రం మాదిరిగానే ఈ సినిమా విడుదల మీద కూడా ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories