రెండు పెద్ద సినిమాల నడుమ ఒక చిన్న సినిమా విడుదల చేయాలంటే… కాస్త ధైర్యమే కావాలి. అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల నడుమ రిలీజ్ చేయాలంటే గట్స్ ఉండాలన్న మాట వాస్తవమే. సరిగ్గా ఇదే విషయాన్ని ‘కింగ్’ నాగార్జున ప్రస్తావిస్తూ… రెండు పెద్ద సినిమాల మధ్యన విడుదల చేయాలంటే గట్స్ ఉండాలి, గత సంవత్సరం అలాగే విడుదల చేసి విజయాన్ని అందుకున్నావు, ఈ సారి కూడా అలాంటి విజయమే నీ సొంతం కావాలి అంటూ… శర్వానంద్ కు శుభాకాంక్షలు చెప్పారు నాగ్.
‘కింగ్’ ట్వీట్ కు స్పందించిన ‘నాచురల్ స్టార్’ నాని… ‘కింగ్ సెట్స్ ది బెంచ్ మార్క్ అగైన్’ అంటూ ట్వీట్ చేసారు. గత మూడు రోజులుగా వరుసగా విడుదల అవుతున్న సినిమాలను ఉదహరిస్తూ నాగార్జున రోజూ ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మొదటి రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది, అలాగే మూడవ సినిమాకు విమర్శకుల నుండి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చేసాయి. దీంతో ఈ ఏడాది మూడు సినిమాలకు మంచి రెవిన్యూ రావచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా.



