Daaku Maharaaj Movie

సంక్రాంతి బరిలో దిగిన గేమ్ చేంజర్‌, డాకూ మహరాజ్ రెండూ విడుదలయ్యాయి. రెండూ పాత కధలే. కానీ గేమ్ చేంజర్‌కి మిశ్రమ స్పందన రాగా, డాకూ మహరాజ్‌కి పాజిటివ్ టాక్ రావడం విశేషం.

నిజానికి గేమ్ చేంజర్‌లో భ్రష్టు పత్తిపోయిన మన రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వంలో బ్యూరోక్రసీని చాలా చక్కగా చూపారు. ఒక అధికారి సమర్ధంగా, నిజాయితీగా పనిచేస్తే వ్యవస్థని ఏవిదంగా చక్కదిద్దవచ్చో గేమ్ చేంజర్‌లో చాలా చక్కగా చూపారు.

Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!

ఇక రామ్ చరణ్‌, ఎస్‌జె.సూర్యల నటన అద్భుతంగా.. పోటాపోటీగా సాగింది. సినిమాలో పాటలు, సంగీతం, కెమెరా వర్క్, సెట్టింగ్స్ అన్నీ చాలా రిచ్‌గా ఉన్నాయి. దేనినీ వేలెత్తి చూపడానికి లేదనిపిస్తుంది. కానీ దర్శకుడు శంకర్ పాత కధని పాతకధలాగే చెప్పడం వలననే ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదనిపిస్తుంది. ఒకవేళ వెంటనే డాకూ మహరాజ్ రాకపోయి ఉంటే కధ విషయంలో ఇంత చర్చ జరిగేది కాదేమో?

దర్శకుడు శంకర్ ఫెయిల్ అయిన చోట బాబీ కొల్లి పాస్ అయ్యారు. డాకూ మహరాజ్‌కి పాజిటివ్ టాక్ రావడానికి కారణం పాత కధని కొత్తగా బాబీ కొల్లి కొత్తగా చెప్పడమే అని అందరూ ముక్త కంఠంతో చెపుతున్నారు.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

బాబీ కొల్లి స్వయంగా బాలయ్య వీరాభిమాని. కనుక ఓ అభిమానిగా ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపారు. అభిమానుల అంచనాలకు మించే బాలయ్యని చూపారని చెప్పొచ్చు.

బాలయ్య కూడా ఓసారి చాలా సౌమ్యంగా, ఓ సారి రౌద్రంగా రకరకాల వెరీయేషన్స్ చూపుతూ అందరినీ మెప్పించారు. ఆయన పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్లకు, చివరికి విమర్శలు ఎదుర్కొన్న ‘దబిడి దిబిడీ’ సాంగ్‌కు థియేటర్లలో చప్పట్లే చప్పట్లు.

Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!

సినిమా స్క్రీన్ ప్లే, తమన్ సంగీతం, విజయ్ కార్తీక కన్నన్ కెమెరా పనితనం వంటివన్నీ ప్రేక్షకులని కధ గురించి మారిచిపోయేలా చేసి మాయచేసికుర్చీలాలో కూర్చోబెట్టేసి డాకూ మహరాజ్‌ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకునేలా చేశారు.

పుష్ప-2, సంధ్య థియేటర్‌ ఘటనల ప్రభావం నుంచి గేమ్ చేంజర్‌ తప్పించుకోలేకపోయింది కానీ డాకూ మహరాజ్ తప్పించుకున్నట్లే ఉన్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని ముందే చెప్పేశారు. ఇది వెంకటేష్‌ మార్క్ కామెడీ, యాక్షన్ చిత్రమని టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో చెప్పేశారు. వాటితో 50 శాతం విజయం సాధించిన్నట్లే కనిపిస్తున్నారు.




ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ అందరినీ రంజింపజేయగల స్టోరీతో సంక్రాంతికి వస్తున్నారు కనుక మిగిలిన 50 శాతం మార్కులు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. దీని సంగతి కూడా తేలిపోతే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ విదంగా ముగిసిందో లెక్కలు కట్టుకోవచ్చు.