బాలయ్యా… నీకు సాటి ఎవరయ్యా..!

Nandamuri Balakrishna spech at Savitri audio launch‘సావిత్రి’ ఆడియో విడుదల సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో నవ్వుల పూలు పూయిస్తోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు వేదికపై ఉన్న నందిత సిగ్గు పడిందంటే ఏ స్థాయిలో బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే సీట్లలో కూర్చున్న శ్రద్ధా దాస్, రష్మిలు కూడా పగలబడి నవ్వారు. ఏ ఈవెంట్ లో అయినా ఎంజాయ్ చేయడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా అనే విధంగా ప్రసంగించారు.

‘లెజెండ్’ సినిమాలో డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించిన బాలకృష్ణ, తానూ కొన్ని పాత్రలే చేయగలుగుతానని, ఈ వయసులో అమ్మాయిలు వెంట పడమంటే ఊరుకుంటారా… మా ఫ్యాన్స్… ఊరుకోరుగా… వెళ్లి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి… అయినా నేను ఎక్కని ఎత్తులు లేవు… చూడని లోతులు లేవు… బాలయ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

ADVERTISEMENT

ప్రస్తుత పాటలు రణగొణధ్వనులతో ఉంటున్నాయని…. అంటూ బాలయ్య ఇచ్చిన హావభావాలు కెవ్వు కేకే. నేను కూడా పాటలు పడుతున్నా… కానీ నన్ను మాత్రం ఎవడూ పాడమని అడగడం లేదంటూ… అందుకే స్టేజ్ పై ఇలా కచేరిలు చేస్తున్నానని బాలయ్య పలికిన మాటలను వర్ణించడం కంటే, బాలయ్య నోటి ద్వారా వింటేనే వాటిని సరిగ్గా ఎంజాయ్ చేయగలుగుతారు. అందుకే బాలయ్య ప్రసంగించిన వీడియో వీక్షకుల కోసం….

ADVERTISEMENT
Latest Stories