‘సమ్మోహనం’ సినిమా సక్సెస్ తర్వాత, తన సొంత ప్రొడక్షన్ ను ఏర్పాటు చేసుకుని నిర్మించిన సుధీర్ బాబు “నన్ను దోచుకుందువటే” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రామిసింగ్ ట్రైలర్ తో ప్రేక్షకులను అలరించే చిత్రంగా భావించిన ఈ సినిమా, నిజంగానే ఆడియన్స్ మనసు దోచుకుందా? అంటే భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
[m9ad]
కొత్తదనం లేని రొటీన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ‘ఓకే’ మార్కులు మాత్రమే వేయించుకుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సిట్యూయేషనల్ కామెడీ, హ్యూమర్ సినిమాకు ప్లస్ కాగా, సెకండాఫ్ లో వచ్చే ఏమోషనల్ సీన్స్ సాగదీసినట్లుగా అనిపించడం మైనస్. ఈ సినిమా హీరోగా, నిర్మాతగా సుధీర్ బాబుకు ఎంత దోహదం చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు గడవాల్సిందే.
కానీ హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను కల్పించడానికి ఈ “నన్ను దోచుకుందువటే” పూర్తి స్థాయిలో సాయపడనుంది. ఓవరాల్ గా… ధియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే చిత్రం కాదు గానీ, ఇదే సమయంలో ప్రేక్షకులను విపరీతంగా అలరించే సినిమా కూడా కాదన్న టాక్ వ్యక్తమవుతోంది.



