Nara Bhuvaneswariబాబు అరెస్టు ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో నిరసన కార్యక్రామాలు జరుగుతూనే ఉంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం సీతానగరంలో నిర్వహించిన దీక్ష శిబిరాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పై ఆధారాలు లేని ఆరోపణలు చేసి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టుకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వానికైనా తగిన ఆధారాలు – సాక్ష్యాలు చూపి అరెస్ట్ చేయడం హేతుబద్దమైన చర్య అవుతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 330 కోట్లు దారి మళ్లించ్చారు అంటూ బాబు పై ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఆసొమ్ము ఎవరి ఖాతాలో జమ అయ్యిందో కూడా సాక్ష్యాలు చూపాలి కదా? ఆ స్కామ్ తాలుకా డబ్బు మరి నా అకౌంట్లోకి వచ్చిందా? లేదా మీ అకౌంట్ లోకి వచ్చిందా? ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు చూపలేక పోయింది.

విచారణ చేసి అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం, అరెస్ట్ చేసి విచారించడం కాస్త విడ్డురంగా ఉంది అంటూ భువనేశ్వరి ప్రభుత్వం పై నేరుగా విమర్శలు చేసారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడమేనా బాబు తప్పు? స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడమేనా బాబు చేసిన తప్పు? రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మించాలి అనుకోవడమేనా బాబు చేసిన తప్పు? తప్పుడు పనులు చేసే నాయకులకు అధికారాన్ని అప్పగిస్తే తప్పుడు కేసులే పెడతారు అంటూ భువనేశ్వరి తన ఆవేదనను బహిరంగ పరిచారు.

లోకేష్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎక్కడ ఆగిందో అక్కడినుండే లోకేష్ తన యువగలంతో ప్రజా క్షేత్రంలోకి వస్తారని హామీ ఇచ్చారు.ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలను అణిచివేయడం, కార్యకర్తల పై కేసులు పెట్టడం వైసీపీ నిరంకుశత్వ పాలనకు అద్దం పడుతుంది.తమ నేతకు మద్దతు తెలిపే హక్కు కూడా రాష్ట్రంలో లేకుండా పోయిందా, శాంతియుత నిరసనలకు సైతం ప్రభుత్వం అనుమతి నిరాకరరించడం వైసీపీ ప్రభుత్వ భయానికి సంకేతం అంటూ నారా భువనేశ్వరి పేర్కొంది. వైసీపీ ప్రభుత్వం తాలూకా విధానాలు అంతేనేమో మరి.