మహిళా శక్తికి నిదర్శనం నారా భువనేశ్వరి!

Nara Bhuvaneswari Wins Golden Peacock Award

పురుషులతో మహిళలు సమానం అంటారు కానీ అలా సమానం అయ్యేందుకు మహిళలు పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతుంటే వారితో పోరాడాలి. సమాజం, ముఖ్యంగా పురుష సమాజం విసిరే సవాళ్ళు, ఈసడింపులు అవమానాలను భరించాల్సి ఉంటుంది.

ఇవన్నీ అధిగమించిన తర్వాత పురుషులతో పోటీ పడి తమ ప్రతిభా పాటవాలు, శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఓ స్థాయికి చేరుకుంటే సరిపోదు… అక్కడ నుంచి కింద పడిపోకుండా ద్రుడంగా నిలద్రొక్కుకొని నిలబడాలి. అప్పుడే లోకం జేజేలు పలుకుతుంది. అంతవరకు ప్రతీ మహిళ ఒంటరి పోరాటాలు చేయక తప్పదు.

కనుక ఏ రంగంలోనైన పురుషులు సాధించే పెద్ద పెద్ద విజయాల కంటే మహిళలు సాధించే చిన్న చిన్న విజయాలు కూడా ఎంతో గొప్పవని చెప్పక తప్పదు.

సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కుటుంబం, సమాజం నుంచి ఇటువంటి సవాళ్ళు ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడలేదు. కానీ హెరిటేజ్ సంస్థ ఎండీగా ఆ సంస్థను అగ్రస్థానంలో నిలబెట్టి సమర్దురాలైన వ్యాపారవేత్తగా నిలిచారు.

జాతీయ స్థాయిలో ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో ప్రతిష్టాతమకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోబోతున్నారు.

ఆహార ఉత్పత్తుల నాణ్యతలో చిన్న లోపం ఏర్పడినా అది విషంగా మారి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్ వంటివి ఇంకా త్వరగా చెడిపోతాయి. కానీ ఇటువంటి క్లిష్టమైన వ్యాపారాన్ని కూడా నారా భువనేశ్వరిగారు దశాబ్దాల తరబడి విజయవంతంగా నడిపిస్తున్నారు. సంస్థని లాభాలు ఆర్జించి పెడుతూనే ఉన్నారు. కనుక ఈ గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఆమె అన్ని విధాల తగినవారే.

నారా భువనేశ్వరిగారు హెరిటేజ్ కంపెనీ నిర్వహణతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ట్రస్ట్ అధ్వర్యంలో అనేక ప్రజా సేవ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో స్వయంగా పాల్గొంటారు.

ట్రస్ట్ అధ్వర్యంలో ఆమె మహిళల ఆర్ధిక స్వావలంభన, నిరుపేద విద్యార్ధులు చదువుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తుంటారు.

ముఖ్యంగా తలసేమియా (వారసత్వంగా రక్త హీనత) వ్యాధి గురించి, దానితో బాధపడుతున్న రోగులకు ఉచితంగా రక్తం ఎక్కించుకునేందుకు ట్రస్ట్ తరపున ఆమె అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు.

కనుక సమాజానికి చేస్తున్న ఇటువంటి సేవలకు, ఆమె సామాజిక చైతన్యానికి గాను లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడి) ఆమెకు ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్‌ 4న లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా ఆమె ఈ అవార్డు అందుకోబోతున్నారు.

ఇదివరకు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా వంటివారు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు.

ప్రతీ భర్త విజయం వెనుక భార్య ఉంటుందంటారు. అలాగే నారా భువనేస్వరిగారి ఈ విజయం వెనుక ఆమె భర్త సిఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. శనివారం రాత్రి వారిరువురూ కలిసి హైదరాబాద్‌ నుంచి లండన్ బయలుదేరుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories