Nara Lokesh Foundation Stone

సమైక్య రాష్ట్రంలో, విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తున్నది రాయలసీమకు చెందినవారే. కానీ దశాబ్ధాలుగా తీవ్ర వివక్షకు గురైనందున ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమ కరువు కాటకాలకు నిలయంగా మారింది. ఎట్టకేలకు సిఎం చంద్రబాబు నాయుడే రాయలసీమకి నీటి కరువు, ఉద్యోగాలు, ఉపాధి కరువు తీర్చబోతున్నారు.

ఇదివరకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడే తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ పారిశ్రామికవాడని ఏర్పాటు చేసి దానిలో వందలాది చిన్నా పెద్ద పరిశ్రమలను తీసుకువచ్చారు.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

ఈసారి టీడీపీకి, సిఎం చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా మరింత అనుకూలమైన పరిస్థితి నెలకొని ఉండటంతో అటు చిత్తూరు, కడప నుంచి ఇటు కర్నూలు, అనంతపురం, నెల్లూరు వరకు అనేక పరిశ్రమలు రప్పిస్తున్నారు.

కర్నూలు జిల్లా ప్రజల చిరకాల వాంఛ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క కర్నూలు జిల్లాలోనే వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటవుతోంది.

Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?

రాయలసీమ అభివృద్ధిలో భాగంగా నేడు మంత్రి నారా లోకేష్‌ అనంతపురం జిల్లా పెద్దపల్లి మండలంలో గుత్తిలో ‘రిన్యూ’ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకి ఆ సంస్థ ఛైర్మన్‌ సుమంత్ సిన్హాతో కలిసి భూమి పూజ చేశారు.

రిన్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ ఇక్కడ రూ. 22,000 కోట్ల పెట్టుబడితో దేశంలోకే అతి పెద్ద హైబ్రీడ్ పవర్ స్టోరేజ్ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో సోలార్ 1.8గిగావాట్స్, విండ్ 1 గిగావాట్ కలిపి మొత్తం 2.8 గిగావాట్స్ సామర్ధ్యంతో నిర్మించబోతున్నారు.

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

సోలార్, విండ్ మిల్స్ వంటి పునరుత్పాదక విద్యుత్ గురించి అందరికీ తెలుసు. వాటి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ని భారీ బ్యాటరీలలో నిలువచేసి అవసరమైనప్పుడు వాడుకునే ఆర్‌ఈ టెక్నాలజీతో దీనిని నిర్మిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఏర్పాటయిన, కాబోతున్న వాటిలో ఇదే అతి పెద్ద ప్లాంట్‌.




అయితే ఒకేసారి కాకుండా ఈ ప్లాంట్‌ని దశల వారీగా విస్తరిస్తారు. ముందుగా సోలార్ 587 మెగావాట్స్, విండ్ మిల్స్ 250 మెగా వాట్స్ సామర్ధ్యంతో నిర్మిస్తారు. దీంతో పాటు 415 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన విద్యుత్ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారు.