గన్నవరంలో నిన్న టిడిపి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభకి భారీగా జనాలు తరలివచ్చి సభను విజయవంతం చేశారు. ఇక టిడిపి యువనేత నారా లోకేష్ ప్రసంగం సభకే హైలైట్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు రోడ్ షోలో కొన్ని వందల మంది ఎదుట మాట్లాడేందుకు తడబడే నారా లోకేష్ నిన్న సుమారు రెండు లక్షలమంది ఎదుట అందరినీ ఆకట్టుకొనేలా ప్రసంగించడం విశేషం. నారా లోకేష్ ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు..
*గన్నవరం నుంచి ఎందరో మహానుభావులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ టిడిపి చేసిన పొరపాటు వలన వల్లభనేని వంశీ అనే పిల్ల సైకో పుట్టుకొచ్చాడు. అతను ఓ సైకో అని గుర్తించలేక సీటు ఇవ్వడం తప్పే. మళ్ళీ అటువంటి పొరపాటు జరగనీయము. 2012 ఎన్నికలతో సన్న బియ్యం సన్నాసి(కొడాలి నాని) పీడ మాకు వదిలిపోయింది. 2019 ఎన్నికలలో మరో పిల్ల సైకో (వల్లభనేని వంశీ) పీడ కూడా మాకు వదిలిపోయింది. వచ్చే ఎన్నికల తర్వాత పెద్ద సైకోతో సహా వైసీపీ సైకోలందరి నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కల్పిస్తాము.
*రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని శాసనసభలో నానా మాటలు అన్నారు. అందుకు నా తండ్రి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. నా తల్లిని, తండ్రిని ఇంతగా అవమానించిన సైకో పార్టీలో అందరికీ మేము అధికారంలోకి రాగానే తగిన ట్రీట్‌మెంట్ తప్పక ఇస్తాము. ముఖ్యంగా గుడివాడలో పెట్రేగిపోతున్న పిల్ల సైకో కొడాలి నానిని కట్ డ్రాయరుతో గుడివాడ పట్టణంలో తిప్పించి మళ్ళీ ఏ తల్లి జోలికి వెళ్లకుండా చేస్తాను.
*రాజకీయ భిక్ష పెట్టిన తల్లిలాంటి టిడిపి కార్యాలయాన్ని తగులబెట్టించిన మరో సైకో వల్లభనేని వంశీకి కూడా జీవితంలో మళ్ళీ మరిచిపోలేని షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తాము. ఈ ఇద్దరికీ ట్రీట్‌మెంట్ ఇచ్చే బాధ్యత నేనే తీసుకొంటాను.
*నేను కృష్ణాజిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయి. మీరు పుట్టిన ఈ గడ్డపై అమరావతిని మీ అధినేత జగన్ చంపేస్తుంటే అడ్డుకోకపోగా ఆయనకు వంతపాడుతూ భజన చేస్తున్న మీరే రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి. మేము నేటికీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నాము. మీకు అలా చెప్పే ధైర్యం ఉందా?అని నారా లోకేష్ సవాలు విసిరారు.



