టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వివాదంపై మాట్లాడుతూ, “ఈ సినిమా దర్శక నిర్మాతల తరపున హైకోర్టులో వైసీపి ఎంపీ, నిరంజన్ రెడ్డి వాదించారు. ఈ సినిమాని జగన్ స్పాన్సర్ చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది?
ఎన్నికలకు ముందు ఇలాంటి సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. మ్యాటర్ లేని కధతో సినిమా తీయడం కంటే రాంగోపాల్ వర్మ ఎంచక్కగా కోడికత్తి కధతో సినిమా చేయొచ్చు. లేదా హూ కిల్డ్ బాబాయ్?అనే టైటిల్‌తో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయొచ్చు. ఇవేవీ సినిమాకి సరిపోవనుకొంటే ‘తాడేపల్లి ప్యాలస్ కుట్రలు’తో చక్కటి సినిమా తీయొచ్చు కదా?
మీకు ‘వ్యూహం’ ఉంటే మాకూ ‘ప్రతి వ్యూహం’ ఉంటుంది కదా?మీకు ఈ సినిమా తీయడానికి డబ్బు ఉంటే, మా హక్కులను కాపాడుకొనేందుకు మాకు రాజ్యాంగం ఉంది,” అని అన్నారు.
వైఎస్ షర్మిల ఏపీలో ఉంగరం పోగొట్టుకొని దాని కోసం తెలంగాణలో వెతుకొంటూ ప్రయాసపడిన్నట్లు, రాంగోపాల్ వర్మకున్న ‘టేస్ట్’కి తగ్గ సబ్జెక్ట్ వైసీపిలోనే కావలసినంత ఉన్నప్పటికీ, నారా లోకేష్ చెప్పిన్నట్లు టిడిపి, జనసేనలలో వెట్టుక్కోవడానికి ప్రయాస పడుతున్నారని చెప్పక తప్పదు.
కాకినాడ వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం వంటి అనేక క్రైమ్ థ్రిల్లర్ కధలు ఉన్నప్పటికీ, బహుశః వాటికి స్పాన్సర్స్ దొరకనందున రాంగోపాల్ వర్మ వాటి జోలికి పోలేదేమో?
అయితే తన సినిమా బావుందా లేదా?అని వెనక్కు తిరిగి చూసుకొనే స్టేజి రాంగోపాల్ వర్మ ఎప్పుడో దాటేశారు. కనుక ‘వ్యూహం’ సినిమా ఎలా ఉన్నప్పటికీ ఆయన ఆశించిన్నట్లే దీంతో పెద్ద వివాదం మొదలైంది. తెలంగాణ హైకోర్టులో కేసు నడిచి సినిమాకి బ్రేక్ పడింది. దీంతో ఆయనకు మళ్ళీ ‘ఫ్రీ పబ్లిసిటీ’ లభించి జనం, మీడియా ఫోకస్ సంపాదించుకొంటున్నారు కూడా. కానీ ఈ వ్యూహం కూడా బెడిసి కొట్టడంతో మద్యలో వైసీపి నవ్వులపాలవుతోంది. కోర్టులో రాంగోపాల్ వర్మకి పడాల్సిన మొట్టికాయలు వైసీపికి పడుతున్నాయి… పాపం!




