ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రధాని మోడీ స్పెషల్ ప్యాకేజీ అంటూ ప్రకటనలు చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం. అయితే వాటిని నమ్మాలా లేదా అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది. ఆ పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు అసలు కేంద్ర సాయంతో అభివృద్ధి చెందిన దాఖలాలు ఏ రాష్ట్రాలలోను లేవని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల వల్లే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అటువంటి ప్రజలను ఆందోళనలతో పక్కదారి పట్టించొద్దని ఆయన పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు. అయితే ప్రధాని ఎక్కడైకనా వెళ్ళి కేంద్రం మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసేస్తాదని చెప్తే మనం నమ్మకూడదు అన్నమాట. అయితే ఇది త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతున్న కర్ణాటకకు కూడా అప్లై అవుతాదేమో!
మరోపక్క రాష్ట్ర బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కేవలం కేంద్రం నిధులతోనే జరుగుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. దీని బట్టి వారు చెప్పేది కూడా అబద్దమే అనుకోవాలా? ఒకరికొకరు పొంతన లేని మాటలతో బీజేపీ నాయకులు అనవసరంగా అభాసుపాలు అవుతున్నారు.



