న్యాయం అందరికీ సమానమేనా?

Nimisha Priya Case: India Reacts to Yemen Verdict

యెమెన్ దేశస్థుడి హత్య కేసులో భారతీయ నర్సు నిమిష ప్రియకు విధించబడిన ఉరిశిక్షను రద్దు చేసిన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

ఓ పక్క ఆమెని కాపాడేందుకు భారత్ విదేశాంగ దౌత్య ప్రయత్నాలు చేయగా, మరోపక్క ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ యెమెన్ వెళ్ళి అక్కడి మత గురువులు, ప్రభుత్వ పెద్దలతో ముఖాముఖి చర్చలు జరిపారు.

ADVERTISEMENT

భారత్‌ గ్రాండ్ ముఫ్తీ మరియు సున్నీ మత గురువు కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లిమియార్ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని ప్రముఖ సూఫీ మత గురువు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ తరపున బృందం కూడా యెమెన్ ప్రభుత్వ పెద్దలతో చర్చలతో జరిపారు. తమ చర్చలు ఫలించడంతో యెమెన్ ప్రభుత్వం ఆమె మరణశిక్ష రద్దు చేసేందుకు అంగీకరించిందని వారు ప్రకటించారు.

కానీ భారత్‌ ప్రభుత్వం ఈ వార్తలు ఖండించింది. ఆమెఉరిశిక్ష ఇంకా రద్దు కాలేదని భారత్‌ విదేశాంగ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
భారతీయ నర్సు నిమిష ప్రియ యెమెన్‌లో తన వ్యాపార భాగస్వామి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు అతనిని అతికిరాతకంగా హత్య చేసి, భారత్‌కు పారిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుబడింది.

యెమెన్ కోర్టు ఆమె హంతకురాలని నిర్దారింఛి ఉరిశిక్ష విధించగా, అతని కుటుంబ సభ్యులు ఆమెను క్షమించేందుకు నిరాకరించారు. దీంతో ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా భారత్‌, కేఏపాల్, అబూబాకర్ ముస్లిమియార్ ప్రయత్నాలు ఫలించి ఉరిశిక్ష వాయిదా పడింది. వారి ప్రయత్నాల వల్లనే ఇప్పుడు ఉరిశిక్ష కూడా రద్దు అయినట్లు సమాచారం.

ఒకవేళ ఇదే ఘటన భారత్‌లో జరిగితే ప్రభుత్వం, సుప్రీంకోర్టు క్షమించి విడిచిపెట్టేస్తాయా?ఈవిదంగా అందరూ ఆమెను కాపాడేందుకు ముందుకు వస్తారా? అని ఆలోచిస్తే కాదనే తెలుస్తుంది. ఇటువంటి కేసులు మీడియాలో కొన్ని రోజులు ఓ వార్తగా కనపడి మాయం అయిపోతుంటాయి. ఒకవేళ ఉరిశిక్ష విధించకపోయినా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది.

ముంబయి ఉగ్రదాడిలో వందల మంది ప్రాణాలు బలిగొన్న పాక్ ఉగ్రవాది కసాబ్‌కి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినప్పుడు, ఏళ్ళ తరబడి న్యాయ విచారణ జరిపారు.

అతను ఉగ్రవాది, హంతకుడని తెలిసి ఉన్నప్పటికీ అతను హంతకుడా కాడా?అని నిర్ధారించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేయగా, అతని కోసం అనేక మంది న్యాయవాదులు వాదించారు. చివరికి ఉరిశిక్ష విదించారు.

కానీ దేశంలో లక్షల మంది పురుషులు, మహిళలు చేయని నేరాలకు ఏళ్ళ తరబడి రిమాండ్ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతున్నారు. బీదరికం కారణంగా బెయిల్‌ కోసం ప్రయత్నించలేక జైళ్ళలోనే మగ్గుతున్నారు. కానీ వారిని పట్టించుకునే నాధుడే లేడు!

అత్యంత దారుణంగా ఓ విదేశీయుడిని హత్య చేసిన నిమిష ప్రియని వందల మందిని కాల్చి చంపినా కసాబ్ ఉరిశిక్ష తప్పించడం కోసం ఇంత న్యాయ విచారణ జరిపి, ఇంత మంది చొరవ తీసుకొని ప్రయత్నించారు. కానీ జైళ్ళలో రిమాండ్ ఖైదీలుగా మగ్గుతున్నవారిని ఏ ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు, ఎవరూ పట్టించుకోకపోవడాన్ని ఏమనుకోవాలి?

ఇందుకు చక్కటి ఉదాహరణ జగన్‌ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను 5 ఏళ్ళపాటు రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గడమే. కానీ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అతికిరాతకంగా హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఆరు నెలల్లో బెయిల్‌పై బయటకు వచ్చేశారు.

ఈ రెండు కేసులు చూసినట్లయితే పేదలకు ఒక న్యాయం, డబ్బు, పరపతి ఉన్నవారికి మరొక రకమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories