నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ అందించిన “చల్ మోహన్ రంగ” ఫస్ట్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 44 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ను కలిగించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకుని, వేసవి కాలంలో విడిపోయాం’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ కు కమెడియన్ వేసిన ‘మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా భయ్యా?’ అనే పంచ్ బాగానే పేలింది.
ఈ టీజర్ లో డైలాగ్ మాదిరే “వర్షాకాలంలో ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ను శీతాకాలంలో పూర్తి చేసుకుని, వేసవికాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని” చెప్పాలి. సొంత ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు ఎస్.ఎస్.థమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా ప్లస్ పాయింట్ కానుంది. నారా రోహిత్ ‘రౌడీ ఫెల్లో’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.



