త్రివిక్రమ్ ఏమిచ్చారో..?

Nithiin - Trivikram Srinivasనితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి… పవన్ కల్యాణ్… త్రివిక్రమ్… కలిసి కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ ఒక నిర్మాత మాత్రమే కాదు .. కథను కూడా అందించారు.

ADVERTISEMENT

‘అజ్ఞాతవాసి’ కథ విషయంలో త్రివిక్రమ్ సరిగ్గా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఇదంతా ఒకెత్తు అయితే కాపీ అన్న విషయం తేటతెల్లమైంది. అలాగే అంతకుముందు నితిన్ తో తీసిన ‘అ… ఆ…’ కూడా నవలకు కాపీ అందించారు. ఈ కారణంగా నితిన్ సినిమాకి ఆయన అందించిన కథా నేపథ్యం గురించే ట్రేడ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన కథ రొమాంటిక్ డ్రామాగా కొనసాగుతుందనేది తాజా సమాచారం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 12 న టైటిల్ ను ఖరారు చేసి .. 14న టీజర్ ను రిలీజ్ చేసి .. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT
Latest Stories