పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతుందని దాని వల్లనే కేంద్రం నిధులు ఆపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ దీనికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా చాలా సార్లు వంత పడటం మనం చూసాం. అయితే ఇప్పటిదాకా అటువంటి మాట అనని కేంద్రం తాజాగా ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్ట్ సీఈఓ తమకు యూసీలు, బిల్లులు పంపడం వల్ల గందరగోళంగా ఉంది నిధుల విడుదల ఆలస్యం అవుతుందని, కావున తమకు బిల్లులు మాత్రమే పంపితే చాలని ఆయన అన్నారు. బిల్లులు లేకుండా నిధులు కేటాయింపు అంటే ఎలాంటి అవినీతి లేదనే అనుకోవాలి. నిజంగా కేంద్రానికి అటువంటి అనుమానం ఉంటే బిల్లులు లేకుండా ఒక్క రూపాయి కూడా విడుదల చెయ్యము అని చెప్పేది.
ఆయన ఈ విషయం చెప్పినప్పుడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఓఎస్డీ కూడా ఉన్నారు. కావున ఇప్పటిదాకా చేసిన విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవే అనుకోవాలి. ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చెయ్యడం సహజమే మరి సాక్షాత్తు గవర్నమెంట్ లో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ వారు కూడా ఇలా మాట్లాడటం దేనికి నిదర్శనమో?



