పోలవరం ప్రాజెక్టును ఇప్పటినుండి పరుగులు పెట్టిస్తాం అని, ఇక నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పోలవరంను సందర్శిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఉత్సాహం ఆదిలోనే ఆవిరైయింది. ఈ నెల ఇరవై రెండున కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరి రావల్సి ఉంది.
ఆయన రాక వాయిదా పడగా,ఆయన ఓఎస్డి పోలవరం సందర్శించడం విశేషం. జనవరి మొదటి వారంలో గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందని, ఈ మేరకు ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై నివేదికను అందజేస్తామని ఆయన వివరించారు. మొదటి తడవ పర్యటనే వాయిదా అంటే వారి నిబద్దత ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.
ఈ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం తమనే చెయ్యనిస్తే ఇరగదీసే వాళ్లం అని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు వట్టి మాటలనే తేలిపోయాయి. మరో వైపు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనే అంతా చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్న అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు కేంద్రానికి కూడా ఫిర్యాదులు పంపారు. వీరికి రాష్ట్రప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువా అనే ప్రశ్న ప్రజలనుండి వస్తే వారికే ఇబ్బంది మరి.



