టీడీపీ – జనసేన పొత్తులో పెద్ద సమస్యగా మారిన ముఖ్యమంత్రి స్తానం పై ఇరు పార్టీల క్యాడర్ కు ఒక క్లారిటీ ఇచ్చారు నార్ లోకేష్ .2024 ఎన్నికలలో టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ లోకేష్ ఒక ఇంటర్ వ్యూలో విలేకరు అడిగిన ప్రశ్నకు తడబడకుండా సమాధానము చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్ధవంతమైన నాయకత్వం, అనుభవమున్న నాయకత్వం అవసరమని పవన్ కళ్యాణ్ కూడా పలు మార్లు చెప్పడం జరిగిందని ఇందులో ఎటువంటి సెకండ్ తాట్ లేదని అనుభవానికే పెద్దపీఠ అనేది ఇరు పార్టీల నాయకులకు స్పష్టం చేశారు లోకేష్. పవన్ కూడా తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తమకెంత బలమో అంతే హక్కు అనేది మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు.
గత ఎన్నికలలో 6 నుంచి 7 శాతం ఓటు బ్యాంకు సంపాదించుకున్న జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటును దక్కించుకుంది. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే పవన్ కళ్యాణ్ ఇందుకు తన పార్టీ నేతలను ముందుగానే సిద్దంచేసినట్టు సమాచారం.అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెపుతున్న పవన్ ఎప్పుడు ముఖ్యమంత్రి స్థానం పై ప్రకటన చేయకపోవడంతో పవన్ అభిమానులు కొందరు సీఎం..సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఒక్కోసారి పవన్ కోపానికి కూడా కారణంగా మారుతున్నారు.
ఎన్నికలకు ముందుగానే లోకేష్ ఈ ప్రకటన చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. జనసైనికులను, పవన్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకుల విమర్శల దాడి పెరుగుతుంది.వీటిని ఎదుర్కొంటు ఇరు పార్టీల అభిమానులను సమన్యయ పరుచుకుంటూ ఎన్నికల బరిలో విజయం సాధించడం టీడీపీ, జనసేన పార్టీలకు కత్తి మీద సాము వంటిదే అనేది వాస్తవం.
అయితే వాస్తవాలను ఏమార్చి ప్రజలను, ఇరు పార్టీల క్యాడర్ ను మభ్యపెట్టి ఎన్నికల బరిలో దిగడం కంటే నిజాలను వెల్లడించి ఇరు పార్టీల నేతలను ఒప్పించి ముందుకెళ్లడం మేలని భావించిన లోకేష్ తెలుగు తమ్ముళ్లకు, జనసైనికులకు పవర్ షేరింగ్ మీద ఉన్న అపోహలను తొలగించడం ఒక విధంగా ఆయనలో ఉన్న నిజాయితీకి అద్దంపడుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




