
కరోనా వైరస్ మాదిరి సినీ ఇండస్ట్రీకి ఈ ‘పైరసీ’ వైరస్ పట్టింది. ఈ వైరస్ ప్రభావంతో ఎంతో మంది సినీ కుటుంబాలు, సినీ కార్మికులు రోడ్డున పడుతున్నారు. అయితే గతంలో ఈ పైరసీ భూతం మీద యుద్ధం చేసిన ఇండస్ట్రీ పెద్దలు ఓటిటి అనే వాక్సిన్ తో కాస్త దాని ప్రభావాన్ని తగ్గించగలిగారు.
అయితే ఇప్పుడు ఆ ఓటిటి వాక్సిన్ కూడా ఈ పైరసీ విస్తరణను ఆపలేకపోతుందా అనిపిస్తుంది. ఇండస్ట్రీ నుంచి చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆ చిత్ర హీరో, హీరోయిన్, దర్శకుడు, వచ్చిన చీఫ్ గెస్ట్ సహా అందరు కూడా తమ స్పీచ్ చివర్లో “అందరు తప్పనిసరిగా సినిమాను థియేటర్లలో” మాత్రమే చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారు.
Also Read – చంద్రబాబు వద్దు.. లోకేష్ ముద్దు!
అయినా కూడా దాని ఫలితం మాత్రం సోషల్ మీడియాలో ఏమాత్రం ప్రభావం చూపడం లేదనే అనిపిస్తుంది. అయినప్పటికీ, ఎన్నో చిత్రాలు ఈ పైరసీ ప్రింట్ల వల్ల నష్టాలను చవిచూడక తప్పడం లేదు. అయితే ఇండస్ట్రీకి ఈ సమస్యేమీ ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. గతంలోనూ మహేష్ నాని, అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను కూడా ఈ పైరసీ భూతం భయపెట్టింది.
అలాగే సినిమా రిలీజ్ కు ముందే ఆ సినిమాకు సంబంధించిన హెచ్.డీ ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సందర్భాలను ఇండస్ట్రీ చూసింది. ఇందులో పవన్ అత్తారింటికి దారేది, విజయ్ టాక్సీవాల చిత్రాల విషయంలో ఈ విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ పైరసీ వైరస్ మరోసారి ఇండస్ట్రీ మీద తన పంజా విసురుతుంది.
Also Read – రుషికొండ ప్యాలస్‌కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్‌కి జీరో!
2025 సంక్రాంతి కానుకగా వచ్చిన “గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాలు రిలీజ్ అయిన తొలి రోజే ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చేసాయి. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ఒక ఛానల్ ఏకంగా తొలి రోజే వారి టీ.వీ ఛానల్ లో ప్రసారం చేశారు. దీనితో చిత్ర బృందం దానిపై లీగల్ కేసు పెట్టగా, ఆ ఓనర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇక డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సైతం ఇలాగే తొలి రోజే పైరసీ వెబ్ సైట్లలో హెచ్.డీ ప్రింట్లతో లీక్ అయ్యింది. అయితే, ఇప్పుడు తాజాగా నాగ చైతన్య హీరో గా, సాయి పల్లవి హీరోయిన్ గా, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ ను కూడా తొలి రోజే ఈ పైరసీ భూతం వెంటాడింది. తండేల్ పూర్తి చిత్రం విత్ హెచ్ డి ప్రింట్ తో నెట్టింట దర్శనమిచ్చింది.
Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు
దీనితో అటు చిత్ర నిర్మాతలు, ఇటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. అలాగే సినిమా విదులైన మొదటి రోజే హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్ లో దర్శనమిస్తే ఇక ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. దీనితో సదరు ఓటిటి సంస్థలు కూడా ఈ పైరసీ వైరస్ బాధితులుగా మిగలాల్సి ఉంటుంది.
దీని మీద అటు సినీ ఇండస్ట్రీ తో పాటుగా ఇటు ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా సరైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న టాలీవుడ్ ఈ పైరసీ వైరస్ తో మునుముందు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోకతప్పని పరిస్థితి నెలకొంటుంది.