హీరోయిన్ పై అరెస్ట్ వారెంట్!

non bailable arrest warrant to actress Mamta Kulkarniఒకప్పుడు బాలీవుడ్ ప్రపంచాన్ని ఊపిన ముద్దుగుమ్మ మమతా కులకుర్ణికి, డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు సంవత్సరాలుగా కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ విక్కీ గోస్వామి పైన ఠాణే ప్రత్యేక కోర్టు నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.

2014లో షోలాపూర్‌లోని ఎవాన్ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఠాణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దీని వెనక మమతా కులకర్ణి, విక్కీ గోస్వామి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ విషయం బయట పడినప్పటి నుంచి మమతా కులకర్ణి అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఆమెను అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కోర్టు నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories