భయపడుతున్న బయ్యర్స్…కారణం?

NTR -Biopic -Kathanayakudu - Vinayavidheya Ramaఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. అందులో సంక్రాంతి బరిలో నిలిచిన వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి కాగా, ఇంకొకటి తాజాగా విడుదలయిన మజ్ను.

అయితే ఈ మూడు సినిమాల పుణ్యమా అని, పాపం బయ్యర్స్ కి భారీ నష్టాలే మిగిలాయి. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉంది అంటే, అసలు రానున్న మరో రెండు మూడు నెలల వరకూ బయ్యర్స్ సినిమాలు కొనే ఆలోచనలోనే లేరట అంతలా దెబ్బ కొట్టాయి ఆ సినిమాలు.

ADVERTISEMENT

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమా వైపు చూసే నాధుడే లేదు. అయితే సమ్మర్ ఫీవర్ మొదలు అయినప్పటి నుంచి అయితే బయ్యర్స్ కి ఏమైనా కలసి రావొచ్చు…ఎందుకంటే ప్రిన్స్ మహర్షి, నాని జెర్సీ సినిమాలు సమ్మర్ బరిలో ఉన్నాయి కనుక. మరి ఈ లెక్కన మరో రెండు నెలల పాటు బాక్స్ ఆఫీస్ పెద్దగా సందడి చేసే అవకాశాలు లేనే లేవు.

ఏది ఏమైనా…సంక్రాంతి సినిమాలు మొదలుకొని మజ్ను వరకూ బాక్స్ ఆఫీస్ సైలెంట్ అయ్యేలా ఫలితాన్ని ఇచ్చాయి. మరి సమ్మర్ అయినా బాక్స్ ఆఫీస్ ని కాస్త కలెక్షన్స్ తో కూల్ చేస్తుందేమో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories