నిన్నటి వరకూ పేట సినిమా విషయంలో థియేటర్స్ ప్రాబ్లెమ్ ఉంది అంటూ చాలా వార్తలే వినిపించాయి. అయితే అది నిజమే కొందరు బడా నిర్మాతల చేతుల్లో ఇండస్ట్రీ ఇరుక్కుపోవడం వల్ల అలా జరిగింది అని రకరకాలా వార్తలు మనకు తెలిసినవే. అయితే ఏది ఎంతవరకూ నిజం అన్న మాట పక్కన పెడితే, ఇప్పుడు ఎన్ఠీఆర్ సినిమాకు కాస్త అదే రకమైన సవాళ్లు ఎదురు అవనున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దానికి గల కారణం ఏంటి అంటే వినయ విధేయ రామ సినిమా…ఈ సినిమాని యువి వాళ్ళు కొనడం, అదే క్రమంలో ఏరియాల పరంగా దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను దిల్ రాజుకు అమ్మడం చక, చకా జరిగిపోయింది. కట్ చేస్తే వీళ్లకు థియేటర్స్ కొరత లేదు, పైగా దిల్ రాజు నిర్మించిన ఎఫ్-2 సైతం సంక్రాతి రేస్ లో ఉండడంతో ఈ రెండు సినిమాలకు కలపి భారీగానే థియేటర్స్ ను బ్లాక్ చేసేసాడు దిల్ రాజు.
కట్ చేస్తే ఇప్పుడు ఎన్ఠీఆర్ బయోపిక్ కి ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టంగా మారింది అని తెలుస్తుంది. అయితే అసలు పండగ మొదలయ్యే సోమవారం నుంచి ఏ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఉంటాయో ఆ సినిమానే ఎక్కువగా రాబట్టుకునే అవకాశం ఉంటుంది…ఎందుకంటే అసలే వారం రోజుల్లోనే ఎయిటీ పర్సంట్ రెవెన్యూ రాబట్టాల్సిన రోజులు కదా ఇవి…మరి చూద్దాం ఏ సినిమా ఎలాంటి రిసల్ట్ ఇస్తుందో…ఎంత వసూలు చేస్తుందో.



